Amazon Mobile offers: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గింపు ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అది కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లపై బారీగా ఆఫర్ లభిస్తోంది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ లాంగ్ బ్యాటరీ లైఫ్, 12 జీబీ ర్యామ్ కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో Redmie Note 13 Pro, Motorola G84, Poco X6 Neo, Vivo V29 Pro, Realme 12 Pro Plus 
వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. 


Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఇప్పుడు 16,499 రూపాయలకు లభిస్తోంది. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు తక్షణ డిస్కౌంట్ ఉంటుంది. దాంతో ఈ ఫోన్ కేవలం 15,499 రూపాయలకే పొందవచ్చు.


Motorola G84 5G ఇప్పుడు అమెజాన్‌లో 19,179 రూపాయలకు లభిస్తోంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరో 1000 రూపాయలు లభిస్తాయి. అంటే ఈ ఫోన్ కేవలం 18,179 లకే లభిస్తుందన్నమాట.


VIVO V29 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా 39,990 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా 1000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 


Redme note 13 5G అమెజాన్ సమ్మర్ సేల్‌లో కేవలం 20,999 రూపాయలకే లభిస్తోంది. ఇది కూడా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ సహా కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 


Realme 12 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా 31,870 రూపాయలకు లభిస్తోంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఐసీఐసీఐ కొన్ని బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 


Also read: Amazon Summer Sale 2024: బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు Apple, HP, Dellలపై భారీగా 45 వేల వరకూ తగ్గింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook