Amazon Prime Day Sale 2024 Full Details: గత నెలలోనే అద్భుతమైన ఆఫర్లతో అతిపెద్ద సేల్‌ ఈవెంట్‌ నిర్వహించిన అమెజాన్‌ ఇప్పుడు సరికొత్త ఆఫర్లతో పండుగ తీసుకొస్తుంది. అతి తక్కువ డిస్కౌంట్లతోపాటు వేగవంతమైన డెలివరీతో ముందుకు వస్తోంది. రెండు రోజుల పాటు భారీ ఆఫర్లతో ఈ పండుగ నిర్వహించనుంది. అయితే ఈ ఆఫర్లు పొందాలంటే చిన్న మెలిక పెట్టింది. రెండు రోజులు నిర్వహించే ఈ ఆఫర్ల పండుగ కేవలం అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు వర్తింపు చేయనుంది. ప్రైమ్‌ సభ్యుల కోసమే ప్రత్యేకంగా అతిపెద్ద సేల్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోంది. జూలై 20-21 తేదీల్లో అతిపెద్ద సేల్‌ ఈవెంట్‌ జరగనుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్‌


 


ఇంటి అవసరాలతోపాటు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, దుస్తులు మొదలుకుని గృహోపకరణాల వరకు అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లు అందిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే సేల్‌ ఈవెంట్‌లో ఎలాంటి ఆఫర్లు ఇస్తోంది.. ఏ బ్యాంకులకు ఎంత డిస్కౌంట్‌, క్యాష్‌ బ్యాక్‌ వంటి వివరాలు తెలుసుకోండి. అమెజాన్‌ ప్రైమ్‌ డే ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఇది 8వ ఎడిషన్‌ కావడం విశేషం. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్టుగానే ఈ ఏడాది నిర్వహిస్తోంది.

Also Read: Jio Hikes Tariff: కస్టమర్లకు జియో భారీ షాక్‌.. ఊహించని రీతిలో అన్నీ రేట్లు భారీగా పెరుగుదల


 


ఎప్పుడు, ఏమిటి?
తేదీ: జూలై 20 నుంచి 21 వరకు
సమయం: మొత్తం 48 గంటలు. 20వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభమై జూలై 21 రాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది.
అర్హులు: అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు మాత్రమే.
ఏమేం వస్తువులు: వంట సామగ్రి, ఫ్యాషన్‌, వస్త్రధారణ, ఆభరణాలు, హస్తకళ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ తదితర మొత్తం 450కి పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. శామ్‌సంగ్‌, వన్‌ ప్లస్‌, ఐక్యూ, హానర్‌, సోని, ఆసుస్‌, ఇంటెల్‌ వంటి ప్రపంచ బ్రాండ్‌ వస్తువులు కూడా సేల్‌లో ఉంటాయి.
డెలివరీ సమయం: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ లేదా మరుసటి రోజు డెలివరీ.


బ్యాంకు ఆఫర్లు
ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే నిర్వహించే అమెజాన్‌ ప్రైమ్‌ డే 2024లో వివిధ బ్యాంకులు కొన్ఇ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుదారులకు పది శాతం రాయితీ అందిస్తారు.
అమెజాన్‌ పే, ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులు స్వాగత రివార్డులు పొందుతారు.
భారీ డిస్కౌంట్లు
అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో ఫ్లాగ్‌షిప్‌ అమెజాన్‌ ఉత్పత్తులలో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఎకో స్మార్ట్‌ స్పీకర్లు, ఫైర్‌ టీవీ స్టిక్‌లు 55 శాతం వరకు తగ్గింపు పొందుతారు.


ప్రైమ్‌ సభ్యత్వం పొందాలంటే..
అమెజాన్‌ కొన్ని రకాల ప్రైమ్‌ సభ్యత్వాలు అందిస్తోంది. నెలకు రూ.299, మూడు నెలలకు రూ.599, వార్షిక సభ్యత్వం రూ.1,499.  షాపింగ్‌కు ప్రత్యేకంగా ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ ప్లాన్‌ ధర రూ.399 ఉంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన సభ్యులు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వినోదం పొందవచ్చు. అంతేకాకుండా షాపింగ్‌, మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ వంటి సౌకర్యాలు పొందవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి