Amazon Prime Day Sale Offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. ఇవాళ్టితో ప్రైమ్ డే సేల్ ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా రూ.79 వస్తువులు మొదలు రూ.1లక్ష విలువ చేసే వస్తువుల వరకు భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గృహోపకరణాలు, ల్యాప్‌ టాప్స్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్.. ఇలా బోలెడు వస్తువులు చౌక ధరకే లభిస్తున్నాయి. యూత్‌ బాగా ఇష్టపడే స్మార్ట్ వాచీలపై కూడా ఈ సేల్‌లో బంపరాఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy Watch 3 : శాంసంగ్ గెలాక్సీ వాచీ 3 45 ఎంఎం బ్లూటూత్ (మిస్టిక్ బ్లాక్) అసలు ధర రూ.34,999. కానీ అమెజాన్ 'ప్రైమ్ డే' సేల్‌లో ఈ వాచీపై ఏకంగా 60 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. తద్వారా రూ.21 వేలు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను కేవలం రూ.13,900కే ఈ వాచీని కొనుగోలు చేయవచ్చు.


Noise colorfit Ultra Buzz : బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కలిగిన ఈ స్మార్ట్ వాచీ అసలు ధర రూ.5999. కానీ అమెజాన్ 'ప్రైమ్ డే సేల్'లో దీనిపై 58 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ద్వారా రూ.3500 వరకు ఆదా అవుతుంది. తద్వారా అతి చౌకగా రూ.2499కే ఈ స్మార్ట్ వాచీని కొనుగోలు చేయవచ్చు.


Amazfit Bip 3 Smart Watch : అమెజాన్ బిప్ 3 స్మార్ట్ వాచీ అసలు ధర రూ.4999. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దీనిపై 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ద్వారా రూ.2 వేల తగ్గింపుతో కేవలం రూ.2999కే ఈ స్మార్ట్ వాచీని సొంతం చేసుకోవచ్చు.


oneplus smart band : వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్ (ఎస్‌పీఓ2) స్మార్ట్ వాచీ అసలు ధర రూ.2799. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ స్మార్ట్ వాచీపై 46 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను రూ.1499కే ఈ స్మార్ట్ వాచీని కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్స్‌కు రూ.1300 వరకు ఆదా అవుతుంది.


Redmi watch 2 Lite : రెడ్‌మీ 2 లైట్ 3.94 సెం.మీ స్మార్ట్ వాచీ లాంచింగ్ ధర రూ.7999. కానీ అమెజాన్‌ ప్రైమ్ డే సేల్‌లో దీనిపై 63 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ద్వారా రూ.5 వేలు ఆదా అవుతుంది. కేవలం రూ.2999కే అతిచౌకగా ఈ స్మార్ట్ వాచీని సొంతం చేసుకోవచ్చు. 


Fire Blott Brand Talk 2 : ఈ స్మార్ట్ వాచీ అసలు ధర రూ.9999. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దీనిపై 65 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. తద్వారా రూ.3499కే ఈ స్మార్ట్ వాచీని పొందవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ వాచీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును వాడినట్లయితే మరో 10 శాతం డిస్కౌంట్ పొందుతారు. అలా మొత్తంగా 75 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. తద్వారా కేవలం రూ.2249కే ఈ స్మార్ట్ వాచీని సొంతం చేసుకోవచ్చు.


అమెజాన్‌లో జూలై 23, 24 తేదీల్లో ప్రైమ్ డే సేల్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే కస్టమర్స్ ఇవాళే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఆఫర్ ఈరోజుతో ముగియనుంది. 


Also READ: OnePlus Nord: డెడ్ చీప్‌గా బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. వన్ ప్లస్‌ నోర్డ్‌పై అమెజాన్‌లో రూ.20 వేల తగ్గింపు


Also Read: Car for Sale: కేవలం రూ.50 వేలు, అంతకన్నా తక్కువ ధరకే అమ్మకానికి కార్లు.. పూర్తి వివరాలివే..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.