Amazon Prime Sale July 2023: జూలై 15 నుంచే అమెజాన్ ప్రైమ్ సేల్.. ఈ వస్తువులపై దాదాపు 55 శాతంకు పైగా డిస్కౌంట్..
Amazon Prime Sale July 2023: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ప్రైమ్ సేల్ ని ప్రారంభించబోతోంది. సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై 40 శాతం డిస్కౌంట్ అందించబోతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.
Amazon Prime Sale July 2023: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ, టాబ్లెట్, ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్ స్పీకర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేకమైన సేల్ ను అందించబోతోంది. ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరంలో రెండు నుంచి మూడు ప్రత్యేక సేల్స్ ను రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ జూలై 15 నుంచి 16 తేదీల్లో కొత్త సేల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ తో విక్రయించబోతున్నట్లు పేర్కొంది. ఈ సేల్ లో ఏయే వస్తువులను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ టెక్ కంపెనీలైన OnePlus, iQOO, Realme, Samsung , Motorola, boAt, Sony వంటి టాప్ బ్రాండ్‌లపై ఉత్పత్తులపై అమెజాన్ ఈ సేల్ లో భాగంగా డిస్కౌంట్ ను అందించబోతోంది. అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ జూలై 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై..జూలై 16న రాత్రి 11:59 వరకు కొనసాగనుంది. ప్రైమ్ డే సందర్భంగా ఆమెజాన్ తన సేవలను మరింత వేగం చేసింది. ఈ సేల్ లో భాగంగా ఏవైనా వస్తువులను కొనుగోలు చేస్తే ఆర్డర్ చేసిన అదే రోజు లేదా ఆ మరుసటి రోజు వస్తువులను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైమ్ మెంబర్‌లకు 25 నగరాల్లో అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ లభిస్తుంది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
ఈ వస్తువులపై భారీ తగ్గింపు:
ఈ సేల్ సమయంలో స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇతర వస్తువులు, ఉపకరణాలపై భారీ తగ్గింపుతో అందించబోతోంది. స్మార్ట్ టెక్ పరికరాలు ఎకో, ఫైర్ టీవీ, కిండ్ల్ వస్తువులు ఈ ప్రైమ్ సేల్ లో చాలా చౌకగా లభించబోతున్నాయి. స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55 శాతం వరకు తగ్గింపు లభించబోతున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్ వివరాలు:
ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ తన కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని భారీగా డబ్బులను ఆదా చేసుకునే అవకాశాన్ని కలిగిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా ప్రైమ్ వినియోగదారులకు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్స్ చెల్లిస్తే.. రూ. 2,500 తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో రూ. 300 క్యాష్‌బ్యాక్, రూ. 2,200 రివార్డ్‌లు కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది. నాన్ ప్రైమ్ మెంబర్‌లు రూ. 200 క్యాష్‌బ్యాక్, రూ. 1,800 విలువైన రివార్డ్‌లతో పాటు 3 నెలల పాటు ఉచిత ప్రైమ్ మెంబర్‌షిప్ పొందే అవకాశాలున్నాయి.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook