కాలం మారిపోయింది ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఏ పని అయినా ఆన్‌లైన్ లో జరిగిపోతోంది. సినిమాలు చూసేందుకు ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. టిక్కెట్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో కుటుంబం మొత్తం ఆహ్లాదంగా వినోదాన్ని ఆహ్వాదించే అవకాశాలు కనుమరుగు అయిపోయాయి. అయితే ఇదే తరుణంలో సినిమాలు కూడా ఆన్ లైన్‌లో అందుబాటులోకి రావడంతో... ఇప్పుడు అంతా ఇంటిపట్టునే ఉండి వినోదాన్ని ఆహ్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఓటీసీ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో  ఓటీసీ ప్లాట్‌ఫామ్స్ కూడా సరికొత్త ఫీచర్స్‌తో కస్టమర్లను మరింత ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లపై భారంపడకుండా కొత్త సినిమాలను రెంట్‌లో చూసుకునేలా ‘పే పర్ వ్యూ’ సర్వీసును తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్‌ సర్వీసును నాన్ ప్రైమ్ సబ్‌స్క్రెయిబర్లతో పాటు  ప్రైమ్ సబ్‌స్క్రయిబర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇందు కోసం వెబ్‌సైట్‌తో పాటు ప్రైమ్ వీడియో యాప్‌లో  ప్రత్యేక ట్యాబ్‌ను రూపొందించింది. సినిమాను బట్టి ధరలు నిర్ణయించింది. ప్రేక్షకులు చూడాలనుకున్న సినిమాను అమోజాన్ ప్రైమ్ వీడియోలో చూసేందుకు డబ్బులు పే చేసిన తర్వాత  30 రోజుల తర్వాత రెంట్‌లో అందుబాటులోకి వస్తోంది. అయితే ఆ తర్వాత 48 గంటల లోపు ప్రేక్షకులు ఆ సినిమాను చూడాల్సి ఉంటుంది. కొత్త సినిమా యూజర్ల  కోసం యాక్సస్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. 


మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు ఇండియాలో ఈపాటికే ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుంది. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన అమోజాన్...  కాల క్రమంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వెబ్ సిరీస్‌ను కూడా ప్రసారం చేస్తోంది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన ఇండియా పై అమోజాన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌కు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు పోటీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు తాజాగా పే పర్ మూవీ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడంతో చాలా మంది ఇప్పుడు అమోజాన్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తమ రీచ్ త్వరలో మరింత పెరుగుతుందని అమోజాన్ అంచనా వేస్తోంది. 


also read


Mobile Charging Tips: మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ 5 తప్పులు చేయకండి!


ట్వీట్టర్ లో సమూల మార్పులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook