Amazon Smartphone upgrade days sale: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి కేవలం 5 వేలకే లభించనుంది. ఈ ఫోన్ అసలు ధర 25 వేలు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అద్భుత అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా 25 వేల రూపాయలు పలికే రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి కేవలం 5 వేలకే లభించనుంది. ఈ సేల్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్ కూడా చవగ్గా లభించనున్నాయి.


రెడ్‌మి 5జి స్మార్ట్‌ఫోన్


రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి ఫోన్‌ను కంపెనీ ఇండియాలో 24 వేల 999 రూపాయలకు ప్రవేశపెట్టింది. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌పై 16 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే 20 వేల 999 రూపాయలకు లభించనుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. 


అదనపు డిస్కౌంట్ ఎలా లభిస్తుంది


రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి కొనుగోలు చేసేందుకు మీరు ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీకు 2 వేల రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. అంటే రెడ్‌మి నోట్ 11 ప్రో 5జి ఫోన్ ఇప్పుుడు 18 వేల 999 రూపాయలకే లభించనుంది. ఇప్పుడిక మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో మారిస్తే..మరో 14 వేల 100 రూపాయల వరకూ తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే..ఈ రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 4 వేల 899 రూపాయలకే లభించనుంది. 


రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి ఫీచర్లు


ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్రస్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో వస్తుంది. ఇందులో 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బాకప్, 67 వాట్స్ సూపర్ ఛార్జర్ ఉంటుంది. రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జిలో ట్రిపుల్ రేర్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్. 2 ఎంపీ మైక్రో సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరాతో పాటు వస్తుంది. 


అమెజాన్ ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ చివరి తేదీ ఏప్రిల్ 20 గా ఉంది. అంటే మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలింది.


Also read: Virtual Reality: రూ.800 ఖర్చుతో ఇంట్లోనే 3D సినిమాలను చూసేయోచ్చు.. అదెలాగో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook