Soundbar Days: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సౌండ్​ బార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఇటీవల 'సౌండ్​బార్​ డేస్​' సేల్​కు భారీ స్పందన లభించిన నేపథ్యంలో మరోసారి ఈ ఆఫర్లను ప్రకటించింది. నేటి నుంచి (మార్చి 12) మార్చి 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని అమెజాన్​ వెల్లడించింది. ఈ ఆఫర్​లో జిబ్రానిక్స్​, సోనీ, బోట్​ వంటి.. బ్రాండ్లపై 55 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది అమెజాన్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫర్లు ఇలా..


'బోట్​ అవెంచర్​ బార్ 1700డీ' స్పీకర్​ అసలు ధర రూ.19,990గా ఉంది. కాగా ఈ స్పెషల్​ సేల్​లో దీని ధర రూ.9,999గా ఉంచింది అమెజాన్.


120 వాట్స్ ఆర్​ఎంఎస్​, మల్టిపుల్ కనెక్టివిటీ మోడ్​, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


సోనీ ఎస్​20ఆర్​


సోనీ ప్రీమియం బార్​లకు సాధారణంగా భారీ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. రూ.19,990 విలువన సోనీ ఎస్​20ఆర్​ మోడల్​పై రూ.2,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అంటే ఈ ఫోన్​ను రూ.17,990లకే కొనుగోలు చేసే అవకాశముంది.


400 వాట్స్ సౌండ్, 5.1 ఛానెల్​, డాల్బీ డిజిటల్ వంటి అధునాత ఫీచర్లు ఈ బార్​లో ఉన్నాయి.


జిబ్రానిక్స్​ జుకెబార్​ 3900 మల్టీమీడియా సౌండ్ బార్​


సౌండ్ బార్లలో జిబ్రానిక్స్​కు ఉన్న క్రేజ్​ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనితో ఈ బార్లను అందుబాటు ధరలో లభించేలా ఆఫర్లు ఇస్తోంది అమెజాన్​. ఈ బార్​ అసలు ధర రూ.11,990 కాగా ప్రస్తుత ఆఫర్​లో కేవలం రూ.4,599కే కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది.


ఇందులో 21 ఛానెల్​, 80 వాట్స్ అవుట్​పుట్, సబ్ వూఫర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.



మరిన్ని..


  • ఎల్​జీ ఎస్​64 బార్​ ధరను రూ.21,990 నుంచి రూ.9,990 తగ్గించింది అమెజాన్.

  • ప్యాట్రానిక్స్​ ప్యూర్​ సౌండ్ 1 బార్​ ధరను రూ.3,299 వద్దకు తగ్గించింది. దీని అసలు ధర రూ.6,999.

  • జేబీఎల్​ ఎస్​బీ 231 సౌండ్​బార్​ ధరను రూ.13,999 నుంచి రూ.10,999కి తగ్గించింది అమెజాన్​.


ఇవే కాకుండా ఇతర అన్ని కంపెనీల బార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్. పరిమితకాలనికి సంబంధించిన సేల్​ కావడంతో షరత్తుల వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది.


Also read: Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!


Also read: Vivo Holi Offer: వివో హోలీ ఆఫర్.. వీ23 సిరీస్‌ కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook