Amazon Legal Issues: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ఇండియన్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. దేశీయ మార్కెట్‌లో బలోపేతమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ఆ సంస్థ ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికల్లో అమెజాన్‌ది(Amazon) ఫ్యూచర్ గ్రూప్ సంస్థను రిలయన్స్ సంస్థ 24 వేల 713 కోట్లకు కొనుగోలు చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయపరమైన వివాదానికి తెరతీసింది అమెజాన్. ఈ న్యాయ పరమైన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో ఉంది. లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు జరుగుతున్న వాణిజ్య యుద్ధంగా తెలుస్తోంది. ప్రత్యర్ధుల వ్యాపారాల్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు లేదా విచారించవద్దని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు ఇటీవల సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఈ కామర్స్ వేదికలపై ఎంపిక చేసిన విక్రేతల్ని మాత్రమే అమెజాన్ సంస్థ ప్రోత్సహిస్తోందని..తద్వారా పోటీని అణచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతోందనేది ప్రధానమైన ఆరోపణ. 


ఇండియాలో న్యాయ పరమైన వివాదాల(Legal Dispute) పరిష్కారం కోసం అమెజాన్ సంస్థ లీగల్ ఫీజుల(Amazon spends on legal fees) రూపంలో 8 వేల 646 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. అమెజాన్ పబ్లిక్ అకౌంట్ ఫైలింగ్స్ సమాచారం మేరకు ఈ వార్త వెలువడింది. దీని ప్రకారం అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ సెల్లర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ హోల్‌సేల్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించే ఈ కామర్స్ విభాగాలు 2018-19లో 3 వేల 420 కోట్ల లీగల్ ఫీజులు చెల్లించాయి. అటు 2019-20 లో ఈ విలువ 5 వేల 126 కోట్లుగా ఉంది. అమెజాన్ ఆదాయంలో ఇది దాదాపు 20 శాతంగా ఉంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


అటు సీఏఐటీ (CAIT)కూడా అమెజాన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఇండియాలో కార్యకలాపాల కొనసాగింపు, పటిష్టత లక్ష్యంగా భారత ప్రభుత్వ అధికారుల్ని అమెజాన్, అనుబంధ సంస్థలు ఎలా మభ్యపెడుతున్నాయి, లంచాలిచ్చేందుకు ఆర్ధిక బలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాయనే అంశం. లీగల్ ఫీజులే చెబుతున్నాయని సీఏఐటీ ఆరోపిస్తోంది.రెండేళ్ల కాలంలో 45 వేల కోట్ల టర్నోవర్‌పై ఏకంగా 8 వేల 5 వందల కోట్లు లీగల్ ఫీజులకే చెల్లించిందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చనేది ప్రధాన వాదన. ఈ వ్యవహారంపై అమెజాన్ స్వయంగా విచారణ కూడా ప్రారంభించింది. సీనియర్ కార్పొరేట్ న్యాయవాదిని సెలవుపై పంపేసింది. ఈ ఆరోపణల్ని ధృవీకరించడం కానీ ఖండించడం గానీ చేయలేదు. అవినీతి జరిగితే సహించేది లేదని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది.


Also read: Elon Musk: మరో వివాదంలో ఎలాన్ మస్క్, గిగా ఫ్యాక్టరీ ఇండియాకు రానుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook