Amazon vs Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ ఇ-రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో రిపబ్లిక్ డే సేల్ లను నిర్వహిస్తున్నాయి. Amazon ప్రవేశపెట్టిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022 జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది. అదే విధంగా ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన బిగ్ సేవింగ్ డే సేల్ 2022.. జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. ఈ రెండు సేల్స్ ద్వారా ఎప్పటిలాగే అనేక వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త ఫోన్ కొనుగోలు చేయాలన్నా.. పాత స్మార్ట్ ఫోన్స్ ను అప్ గ్రేడ్ చేయాలన్నా ఈ సేల్ లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు అయిన Apple, Samsung, OnePlus, Xiaomi పై పొందగలిగే ఉత్తమ ఆఫర్లు ఏవో తెలుసుకుందాం. 


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్


OnePlus 9RT 5G


OnePlus 9RT మొదటి సేల్ జనవరి 17న అమెజాన్ వెబ్ సైట్ లో ప్రారంభమైంది. చైనీస్ బ్రాండ్ కు చెందిన ఈ మొబైల్ పై రూ.4 వేలు ఇన్ స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ EMI వంటివి అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్లు పోగా.. ఈ స్మార్ట్ ఫోన్ రూ.36,999లకు కొనుగోలు చేయవచ్చు. 


Apple iPhone 12 (128GB)


Apple iPhone 12 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, అమెజాన్ రెండింటిలో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 128GB వెర్షన్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్‌లో రూ.70,900 ధరతో రూ.61,999 ధరకే లభిస్తోంది. ఇదే వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొంచెం ఎక్కువ ధరకు రిటైల్ అవుతోంది. 128GB వెర్షన్ రూ.63,999గా అమ్మకానికి ఉంది. అయితే 64GB వెర్షన్ రూ.53,999కి వస్తుంది.


Samsung గ్యాలక్సీ S20 FE 


Samsung ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చిన Galaxy S20 FE కంటే ముందు వేరియంట్, Galaxy S21 FEని రూ.54,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు Samsung గ్యాలక్సీ S20 FE అందుబాటులోకి వచ్చింది. అలాంటి ఫీచర్లతో కేవలం రూ.36,990లకే అందుబాటులో ఉంది. 8GB ర్యామ్, 128 స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. 


Redmi నోట్ 11T 5G


రెడ్‌మీ నోట్ సిరీస్ 6GB/128GB స్టోరేజ్ మోడల్‌కు తగ్గింపు ధర రూ.16,999కు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు అనేక ఆఫర్ల ద్వారా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ-రిటైలర్ రెడ్‌మీ నోట్ 11 ప్రో మోడల్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.


Apple iPhone 12 Mini


ఆపిల్ ఐఫోన్ 12 మినీని ఫ్లిప్ కార్ట్ లో రూ.41,999లకే పొందవచ్చు. 64GB స్టోరేజ్ కలిగిన వర్షెన్ పై తగ్గింపు లభిస్తోంది. 256GB స్టోరేజ్ మొబైల్ రూ.64,999లకు విక్రయిస్తున్నారు. ఇంటర్నల్ A14 బయోనిక్ చిప్, 5.4-అంగుళాల సూపర్ రెటినా OLED డిస్ప్లే , 12-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. 


Also Read: Flipkart, Amazon sale: రేపటి నుంచే ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ రిపబ్లిక్​ డే సేల్​.. ఆఫర్లు ఇవే..


Also Read: Tesla and KTR Tweet: ఎలాన్ మస్క్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై పెరుగుతున్న మద్దతు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook