Two Wheeler Sales: ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు, కారణమేంటి
Two Wheeler Sales: ఏపీ ప్రభుత్వానికి ఓ సమస్య ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో ద్విచక్రవాహనాల అమ్మకాలు గత కొద్దికాలంగా క్షీణించాయి. దేశవ్యాప్తంగా అమ్మకాలు పెరుగుతుంటే..రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడం ఆందోళన కల్గిస్తోంది.
ఇప్పుడిప్పుడే ఆర్ధిక వనరుల్ని సంపాదించేందుకు, వాణిజ్యపరంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఓ సమస్య ఏర్పడింది. రాష్ట్రంలో టూ వీలర్ అమ్మకాలు దారుణంగా పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
ఈ ఏడాది అంటే 2022-23 తొలి అర్ధ సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో తగ్గుదల నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీనే దిగువ స్థాయిలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2022-23 తొలి ఆర్ధిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 26.05 శాతం పెరగడం గమనార్హం. ఏపీలో మాత్రం మైనస్ 1.76 శాతం నమోదవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది.
రాష్ట్రంలో చోటుచేసుకున్నఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహనాలు అమ్మకాలు పెంచేందుకు ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖకు సూచించారు. రాష్ట్రంలో అమ్మకాలు పడిపోవడానికి కారణం తెలుసుకునేందుకు, తిరిగి వృద్ధి సాధించేందుకు వాహనాల ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రవాణా శాఖ అధికారులు. వాస్తవానికి అక్టోబర్ 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాహనాల ఉత్పత్తిదారులతో సమీక్ష ఏర్పాటు చేసింది. కానీ ఈలోగా రవాణాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మారడంతో ఆ సమావేశం రద్దైంది.
2021లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏపీలో 3,31,695 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 3,10,054 కు పడిపోయింది. అంటే 6.52 శాతం క్షీణించింది.
ఇక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులు అద్భుతమైన వృద్ధి రేటు సాధించాయి. కర్ణాటకలో 58.06 శాతం, తమిళనాడులో 31.52 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనం ఇటీవల తప్పనిసరిగా మారినా..కొనుగోలు సామర్యం తగ్గిందని ఓ బైక్ కంపెనీ మార్కెటింగ్ ప్రతినిధి తెలిపారు. అన్ని వాహనాలపై రుణ సౌకర్యం వర్తిస్తున్నా అమ్మకాలు మాత్రం తగ్గాయన్నారు. అయితే ఇటీవల దసరా, దీపావళి పండుగల సందర్బంగా కొద్దిగా ఆశించిన వృద్ధి కన్పించింది.
అదే సమయంలో కార్ల అమ్మకాల్లో కూడా ఆశించిన వృద్ధి నమోదు కాలేదు. జాతీయ వృద్ధి రేటు 21 శాతం కాగా..రాష్ట్రంలో కేవలం 8.27 శాతం మాత్రమే ఉంది.
Also read: Today Gold Rate: దేశంలో స్థిరంగా బంగారం, వెండి ధరలు.. విజయవాడలో తులం ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook