Apple: ప్రపంచ టెక్ మార్కెట్ లో యాపిల్ కున్న  క్రేజే వేరు. నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ ఆడ్రస్ యాపిల్. ఏదైనా ఫీచర్‌ని యాపిల్‌(Apple) అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ  దానినే అనుసరిస్తాయి. మెటల్‌ బాడీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, టాప్‌నాచ్‌ ఒకటేమిటి ఇప్పుడు పాపులర్‌ ఫీచర్లలో సగానికి పైగా యాపిల్‌ వల్లే ట్రెండింగ్‌(Trending)లో ఉన్నాయి. వాటన్నింటిని మించి మరో పాత్‌ బ్రేకింగ్‌ ఫీచర్‌ని యాపిల్‌ అందుబాటులోకి తేనుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు(Moble Phones) అన్నీ కూడా నెట్‌వర్క్‌(Network) ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్‌టీఈ (లాంగ్‌టర్మ్‌ ఎవల్యూషన్‌),  5జీ వరకు వచ్చాం. శాటిలైట్‌ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌(Networks)లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌(Leo Networks)లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌(Sim)తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్‌ ద్వారానే ఇటు కాల్స్‌, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ కొనసాగించవచ్చు. 


Also Read: Black Holes: విశ్వంలో తొలిసారి..మూడు బ్లాక్ హోల్స్ విలీనం..గుర్తించిన భారత శాస్త్రవేత్తలు!


ఐఫోన్‌ 13తో మొదలు ?
లియో టెక్నాలజీ(Leo Technology)ని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్‌(Apple) కసరత్తు ప్రారంభించింది.  త్వరలో రిలీజ్‌ చేయబోతున్న యాపిల్‌ 13 మోడల్‌ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  అయితే మొబైల్‌ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్‌ ధరలోనే  అవన్నీ పొందు పరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి యాపిల్‌ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


LEO అంటే..
నెట్‌వర్క్‌ ఫ్రీక్వెన్సీ(Network Frequency)కి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లను మొబైల్‌ కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను ‍ ప్రయోగించేందుకు బడా సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆమెజాన్‌(Amazon), ఎయిర్‌టెల్‌ , స్పేస్‌ఎక్స్‌, టాటా, టెలిశాట్‌ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ 90వ దశకం నుంచి అందుబాటులో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం తరఫున భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌(BSNL) సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook