Apple iPhone 13 Discount Offer: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ త్వరలోనే లాంచ్ అవనుంది. దీనిపై యాపిల్ కంపెనీ నుంచి ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఐఫోన్ 14 రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఐఫోన్ 13పై యాపిల్ భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. అయితే ఇది కేవలం యాపిల్ స్టోర్స్‌లో కొనుగోలు చేసే ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.26 వేలు మేర తగ్గింపు పొందవచ్చు. అంటే.. రూ.79,900 విలువ చేసే ఐఫోన్ 13ని కేవలం రూ.53,900కే మీ సొంతం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.5 వేలు తక్షణ తగ్గింపు :


ఐఫోన్ 13ని యాపిల్ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేస్తే రూ.5 వేలు వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.79,900 విలువ చేసే ఐఫోన్ 13ని కేవలం రూ.74,900కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఒకవేళ ఈ ఐఫోన్ 13 కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని వాడినట్లయితే... మరో రూ.4 వేలు వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అప్పుడు ఈ ఐఫోన్‌ని మరింత చౌకగా రూ.70,900కే పొందవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :


యాపిల్ స్టోర్స్‌లో ఐఫోన్ 13పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.26 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీరు ఎక్స్‌చేంజ్ కోసం ఇచ్చే ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అది పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటేనే పూర్తి ఆఫర్ లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ దక్కించుకున్నట్లయితే రూ.79,900 విలువ చేసే ఐఫోన్ 13ని మీరు రూ.53,900కే సొంతం చేసుకోవచ్చు. 


Also Read: Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి


Also Read:  R Narayana Murthy Mother Death: ఆర్‌ నారాయణ మూర్తికి మాతృవియోగం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook