iPhone 12 Price Cut: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 12 ధర ఇప్పుడు తగ్గిపోయింది. 56 వేల ఫోన్ కేవలం 40 వేలకే లభించనుంది. మీరు కూడా ఐఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఐఫోన్ అంటే ఇష్టపడనివారుండరు. ఆ ఫోన్ ఒక బ్రాండ్. ఓ స్టేటస్ సింబల్ కూడా. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు. ఐఫోన్ 12 ఇప్పుడు ధర తగ్గిపోయింది. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌లో 54 వేలకు అమ్ముతున్న ఐఫోన్ 12 ఇప్పుడు కేవలం 39 వేల 999 రూపాయలకే లభించనుంది. ఆ ఆఫర్లు ఎలాగో తెలుసుకుందాం..


ఆఫర్ ఎలా వర్తిస్తుంది.


ఈ ఆఫర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రిటైల్ ప్రైస్ 56 వేల 999 రూపాయలు. అయితే ఎక్చ్సేంజ్, ఇతర ఆఫర్లను కలుపుకుని అంతకంటే తక్కువ ధరకే పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చ్సేంజ్‌పై అందిస్తే ఫ్లిప్‌కార్ట్ 13 వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ధర అనేది మీరు మార్చే స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి ఉంటుంది. మీరు మార్చే పాత ఫోన్ హై ఎండ్ ఫోన్ అయుండి..చిన్న చిన్న స్కాచెస్ ఉన్నా ఫరవాలేదు. అదే సమయంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం కొన్ని నగరాలకే పరిమితమైంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 4 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఐఫోన్ 12 ఇప్పుడు మీకు కేవలం 39 వేల 999 రూపాయలకే లభించనుంది.


ఐఫోన్ 12 ప్రత్యేకతలు


యాపిల్ ఐఫోన్ 12 ఏ 14 బయోనిక్ చిప్‌తో అభివృద్ధి చేయబడింది. న్యూట్రల్ ఇంజిన్ థర్డ్ జనరేషన్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సూపర్ రెటీనీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. ఫేస్ ఐడీ రికగ్నిషన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఐఫోన్ 12 డ్యూయల్ కెమేరా సెటర్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమేరా 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిడ్ మోడ్ , 4కే వీడియో, స్లో మోషన్ వీడియో , వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ ఇది. 


Also read: Todays Gold Rate: తగ్గిన బంగారం ధర, దేశంలో ఇవాళ ఏప్రిల్ 24న బంగారం ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.