Hyderabad Rentals: కరోనా మహమ్మారి తగ్గుముఖంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మారుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఇళ్ల అద్దెలపై పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 ప్రభావం తగ్గడంతో హైదరాబాద్ జంట నగరాల్లో వర్క్ ఫ్రం హోం తగ్గిపోతోంది. తిరిగి ఆఫీసులు యధావిధిగా పనిచేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మారిపోతోంది. హైదరాబాద్ అంటేనే ఐటీ పరిశ్రమ గుర్తొస్తుంది. వర్క్ ఫ్రం హోం కారణంగా రెండేళ్ల క్రితం తమ తమ ఊర్లకు వెళ్లిన ఉద్యోగులంతా తిరిగొస్తున్నారు. ఇప్పుడు సరైన అద్దె ఇళ్ల కోసం చూస్తున్నారు. 


ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో అద్దె ఇళ్లు, రూమ్స్,ప్లాట్స్‌కు డిమాండ్ పెరిగింది. రెసిడెన్షియల్ డిమాండ్ అనేది ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెరిగింది. తాజాగా విడుదలైన అనారాక్ నివేదిక ప్రకారం అగ్రస్థాయి నగరాల్లో రెసిడెన్షియల్ డిమాండ్ పెరగడం వల్ల అద్దెలు కూడా పెరిగాయని తెలుస్తోంది. కనీసం 5 నుంచి 10 శాతం అద్దెలు పెరిగినట్టు సమాచారం. 


ఫిస్కల్ రెండవ క్వార్టర్ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 7 నగరాల్లో 15,800 యూనిట్ల రెసిడెన్షియల్ సప్లైతో 19 శాతం వాటాతో హైదరాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. రెసిడెన్షియల్ అమ్మకాలు నగరంలో రెండు జోన్లుగా ఉన్నాయి. పశ్చిమ, ఉత్తర హైదరాబాద్ జోన్లు. ఎక్కువమంది ఇళ్ల కొనుగోలుకు కాకుండా అద్దె ఇళ్లకే ప్రయత్నిస్తున్నారు. 


గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, ఎల్‌బి నగర్, అదిబట్ల వంటి ఐటీ కారిడార్ సమీప ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు 5-10 శాతం పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్నించి అంతా తిరిగి జంట నగరాలకు చేరుకోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ అధికమైంది. 


Also read; Indian Railways Good News: చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ టికెట్‌కి మనీ రిఫండ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook