banks raise FD rates వడ్డీ రేటు పెంచనున్న రెండు ప్రభుత్వ, మూడు ప్రయివేట్ బ్యాంకులు
Banks raise FD rates పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, సప్లై చైన్‌లో సమస్యలు తలెత్తడం తదితర కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను వసూలు చేసే వడ్డీ రేటు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచేసింది. దీంతో రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపైనే ప్రధానంగా ఆధారపడ్డ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేశాయి. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రెండు ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు మొత్తం ఐదు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేశాయి. ప్రయివేట్ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ, కరూర్ వైశ్యా బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచేయగా... ప్రభుత్వ బ్యాంకులైన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తాను ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రెపో రేటును 4 నుంచి 4.4 శాతానికి పెంపచడంతో ఆర్బీఐ కింద పనిచేసే బ్యాంకులకు వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ .... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటును 0.25 శాతం పెంచింది. దీనితో 7.7 శాతానికి రేటు పెరిగింది. 2022, మే నెల మే 7 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని హెడ్‌డీఎఫ్‌డీ బ్యాంకు తెలిపింది. 7.15 శాతం నుంచి 7.45 శాతానికి కరూర్ వైశ్యా బ్యాంక్ రెపో ఆధారిత రేటును పెంచింది. మే 9వ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. కెనరా బ్యాంక్ బ్యాంకు కూడా తన రెపో ఆధారిత రుణ రేటును 2022 మే 7 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు రెపో రేటు 7.30 శాతానికి చేరింది. ఈ పెంపు 2022, మే నెల 7 నుంచి తీసుకునే కొత్త రుణాలకు, అడ్వాన్స్‌లకు వర్తించనుంది. పూణే కేంద్రంగా పనిచేసే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఎంసీఎల్‌ఆర్ ను 0.15% పెంచింది. ఈ బ్యాంకు పెంపు కూడా 2022, మే నెల 7వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రెపో ఆధారిత రుణ రేటు 7.20 శాతానికి చేరింది. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ తన రెపో రేటును 7.25 శాతానికి పెంచింది.
రెపో రేటు అంటే ఏమిటి?
తమ వ్యక్తిగత అవసరాల కోసం సమాన్యులు తమ వద్ద సరిపడా డబ్బు లేనప్పుడు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఏదో ఒకటి తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుంటారు. ఇలా తీసుకున్న అప్పుకు వడ్డీ కడతారు. బ్యాంకులకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. అయితే బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సరిపడ నిధులు లేనప్పుడు ఆర్బీఐని ఆశ్రయిస్తాయి. ఈ అప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కమర్షియల్ బ్యాంకులు తమ సెక్యూరిటీలు లేదా బాండ్లను ఆర్బీఐకి అమ్మడం ద్వారా నగదును తీసుకుంటాయి. ఈ నగదుపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటునే "రెపో రేటు " అంటారు. ఆర్థిక ప్రగతి కోసం ఎప్పుడు ఆర్బీఐ తక్కువ రెపో రేటునే వసూలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఆర్బీఐ తక్కువ రెపో రేటు వసూలు చేస్తే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. అప్పుడు అప్పులు తీసుకొని మార్కెట్‌లో పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుంది. అయితే ద్రవ్యోల్భణం పెరిగినప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఆర్బీఐ రేపో రేటును పెంచుతుంది.
also read MTNL Recharge Plan: 49 రూపాయల రీఛార్జ్ తో 180 రోజుల వ్యాలిడిటీ!
also read iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.