Tata Nexon New 2024: టాటా నెక్సన్ కొత్త 2024 వేరియంట్ వచ్చేసింది.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూడండి!
Tata Nexon New 2024: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
Tata Nexon New 2024: భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటాకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీ కార్ల విక్రయాలు టాప్ ప్లేస్ లో ఉంది. టాటా కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసి ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది గతంలో మార్కెట్లోకి లాంచ్ చేసిన మినీ SUV టాటా పంచ్ కి ఎంత ప్రజాదరణ లభించిందో అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ పంచ్ ను ఎలక్ట్రిక్ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే టాటా నెక్సన్‌కు కూడా ఇంతే మొత్తంలో గుర్తింపు లభించింది. దీంతో ఇటీవలే టాటా కంపెనీ ఈ మోడల్ లోనే కొత్త వేరియంట్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కారు ఎంతో శక్తివంతమైన ఇంజన్తో అందుబాటులోకి వచ్చింది. దీనికి కంపెనీ టాటా నెక్సన్ స్మార్ట్ (O)గా నామకరణం చేసింది. అయితే ఈ కార్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ఇది లీటర్‌కు ఎంత మైలేజ్ అందిస్తుందో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సన్ స్మార్ట్ (O) పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన బేస్ వేరియంట్ ధర రూ.7,49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే మార్కెట్లో టాటా కార్ల కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొన్ని కార్లపై ధరలను తగ్గించింది. అందులో టాటా నెక్సన్ కారుకు సంబంధించిన ధరను కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక తగ్గించిన ధరల వివరాల్లోకి వెళితే దాదాపు కొన్ని కార్లపై రూ. 30 వేల వరకు తగ్గించగా హై ఎండ్ కార్లపై రూ. 40 వేల వరకు తగ్గించినట్లు టాటా కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త నెక్సాన్ వేరియంట్ల ధరల వారీగా చూస్తే, టాటా నెక్సన్ స్మార్ట్ ప్లస్ ధర రూ. 8.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక మరో వేరియంట్ టాటా నెక్సన్ స్మార్ట్ ప్లస్ S ధర రూ. 9.40 లక్షల నుంచి మొదలవుతుంది.
టాటా నెక్సన్ డీజిల్ పై భారీ తగ్గింపు:
టాటా నెక్సన్ డీజిల్ వేరియంట్ల కార్లపై టాటా కంపెనీ భారీగా ధరలను తగ్గించి విక్రయిస్తోంది. ఈ కంపెనీ మూడు వేరియంట్లపై దాదాపు రూ. 1.10 లక్షలకు పైగా తగ్గించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోని స్మార్ట్ ప్లస్ ఎస్ వేరియంట్ ధర రూ.10.60లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇటీవల కొత్త వేరియంట్ విడుదలైనప్పటి నుంచి రూ. 1.10 లక్ష తగ్గించి అమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇతర కార్లకు సంబంధించిన వేరియంట్లపై కూడా భారీగా తగ్గించే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
ఇక ఈ కారుకు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే కంపెనీ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులను తీసుకురా లేనట్లు తెలిపింది. ఇది గతంలో విడుదల చేసిన నెక్సన్ 1.2 లీటర్ టర్బో ఇంజన్ తోనే విడుదల చేసింది. ఈ ఇంజన్ దాదాపు 170 mm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కారుకు సంబంధించిన డీజిల్ వేరియంట్ విషయానికొస్తే.. దీని డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజన్‌తో లభిస్తోంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 6 స్పీడ్ AMT గేర్ బాక్స్‌తో లభిస్తోంది. ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి