Atal Pension Yojana Scheme: దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అంటారు.. అలాగే సంపాదిస్తున్న వయసులో కాస్త వెనకేసుకోవాలని చెప్తారు.. ఎందుకంటే వృద్ధాప్యంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయని. ఇప్పటి నుంచి మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తే.. వృద్ధాప్యాన్ని ఆనందమయంగా గడపవచ్చు. అటల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రతి రోజు రూ.7 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు వృద్ధాప్యంలో రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 2015లో కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 6 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఈ స్కీమ్‌లో చేరారు. దేశంలోని ప్రతి వర్గానికి వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కారు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకంలో ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తే.. పదవీ విరమణ తర్వాత రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ మొత్తం మీ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 ఏళ్ల వయసు నుంచి ప్రతి రోజు రూ.7 ఇన్వెస్ట్ చేస్తే.. 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ అందుకోవచ్చు. అటల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.210 చొప్పున 42 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5 వేల పెన్షన్ పొందొచ్చు.


ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు..?


==> భారతీయులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.  
==> 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఇన్వెస్ట్ చేయాలి.
==> గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను పొందలేరు. 
==> భార్యాభర్తలిద్దరూ ఈ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ వస్తుంది. 
==> 60 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  
==> చందాదారుడు మరణిస్తే, నామినీకి పెన్షన్ మొత్తం అందజేస్తారు.


ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?


బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ ఉంటే మీరు ఈ పథకంలో సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ నింపి.. ఫారమ్‌తో పాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. కేవైసీ అప్‌డేట్ తరువాత పెన్షన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి