ATM Cash Withdrawal Charges: రాబోయే ఏడాది జనవరి నుంచి ATM అపరిమిత లావాదేవీలపై రుసులు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ATM లావాదేవీల పరిమితిని మించితే ఎక్కువ రుసులు వసూలు చేయనున్నట్లు తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలు అవుతుందని పేర్కొంది. ATM అపరిమిత లావాదేవీలపై కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు RBI అనుమంతించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI ప్రకటన తర్వాత ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ తమ కస్టమర్లను ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. “RBI మార్గదర్శకాలకు అనుగుణంగా.. 2022 జనవరి 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంక్ ATMలలో ఉచిత పరిమితి లావాదేవీల కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చేస్తే రూ.21 వసూలు చేయబడుతుంది” అని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.


కొత్త ATM లావాదేవీ ఛార్జీలు


2022 జనవరి నుంచి ATM పరిమిత లావాదేవీలు మించితే.. ప్రతి లావాదేవీకి రూ.20 కు బదులుగా రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. “అధిక ఇంటర్ ఛేంజ్ రుసుమును భర్తీ చేసేందుకు, సాధారణ ఖర్చులు పెరుగుదల కారణంగా.. అపరిమిత లావాదేవీల్లో ప్రతి సారి రూ.21 వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతిస్తున్నాం. 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది” అని RBI ఓ ప్రకటనలో తెలిపింది.


ATM ఉచిత లావాదేవీలు


RBI మార్గదర్శకాల మేరకు ప్రతి బ్యాంకు ATM కు నెలకు ఐదు ఉచిత లావాదేవీలకు ప్రతి కస్టమర్ కు అనుమతి ఉంది. కానీ, కొన్ని మెట్రో నగరాల్లోని ATM లలో నెలకు మూడు సార్లు ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంది. నాన్-మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలు చేసేందుకు వీలుంది.


Also Read: Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!


Also Read: Bounce electric scooter : బౌన్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌‌లు వచ్చేశాయి.. ధర తక్కువ, మైలేజ్‌ ఎక్కువ  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook