ATM Usage: ప్రస్తుతం ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్ వచ్చిన తరువాత ఏటీఎం వినియోగం తగ్గిపోయింది. లిక్విడ్ క్యాష్‌కు బదులు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఏటీఎంను చాలా కొద్దిమంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎంలో కేవలం క్యాష్‌ విత్‌డ్రా చేయడంతో పాటు.. ఇతర పనులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతర ఆర్థికేతర లావాదేవీలు కూడా ఏటీఎం నుంచే కంప్లీట్ చేసుకోవచ్చు. ఏటీఏం అనేది కంప్యూటరైజ్డ్ మెషీన్ అనేది అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కస్టమర్‌లు తమ అకౌంట్‌లను యాక్సెస్ చేయడానికి.. క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి.. వినియోగదారులు బ్యాంకును సందర్శించకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏటీఎం కార్డును అందించిన స్లాట్‌లో ఇన్సర్ట్ చేయాలి. ఏటీఎం ఏయే సేవలు మీరు వినియోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.


==> ఏటీఎంలో నగదు ఉపసంహరించుకోవడమే కాకుండా.. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. మీ అకౌంట్‌లో చివరి 10 ట్రాన్సిక్షన్ వివరాలను పొందొచ్చు. ఈ సేవలను ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు.


==> కార్డ్ టు కార్డ్ నగదు బదిలీ కూడా ఏటీఏం ద్వారా చేయవచ్చు. ఒక ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ నుంచి మరో ఎస్‌బీఐ కార్డును తక్షణమే నగదు పంపించవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఛార్జీ కూడా కట్ అవ్వదు. రూ.40 వేల వరకు కార్డ్ టు కార్డ్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఉంటుంది. ఎన్ని లావాదేవీల అయినా చేసుకోవచ్చు. 


==> వీసా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించడానికి ఏటీఎంను ఉపయోగించుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ బిల్లుకు కాగితం రహిత చెల్లింపు చేయండి.


==> మీరు బ్యాంక్ అకౌంట్‌లకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఒకే కార్డ్‌కి గరిష్టంగా 16 అకౌంట్‌లు లింక్ చేయవచ్చు.


==> బ్యాంక్ ఏటీఎంను ఉపయోగించి మీ లైఫ్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవచ్చు. ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటి బీమా సంస్థలు ఏటీఎంల ద్వారా ప్రీమియం చెల్లింపును యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీ వద్ద బీమా నంబరు ఉంటే సరిపోతుంది.


==> మీరు ఏటీఎం నుంచే చెక్ బుక్‌ని ఆర్డర్ చేయవచ్చు. మీరు ఏటీఎం నుంచి చెక్‌ బుక్ రిక్వెస్ట్‌ను మీ చిరునామాకు ఆర్డర్ చేయవచ్చు.


==> మీరు ఏటీఎం నుంచి మొబైల్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు. మీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను రిజిస్టర్ చేసుకోచ్చు.


==> మీరు ఏటీఎం మెషీన్ నుంచి మీ కార్డు పిన్‌ను మార్చుకోవచ్చు. సెక్యూరిటీ కోసం పిన్‌ను తరచుగా మారుస్తు ఉండాలి.


Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు  


Also Read: Etela Rajender: లంబాడా తల్లుల శీలాన్ని శంకిస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఫైర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook