August Bank Holidays 2022: ప్రస్తుత ఆగస్టు నెలలో 16 రోజులు గడిచిపోయాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో ఇప్పటికే బ్యాంకులకు 10 సెలవులు అయిపోయాయి. మరో 8 సెలవులు ఉన్నాయి. ఈ ఎనిమిది సెలవుల్లో ఆగస్టు 18 నుంచి 4 వరుస సెలవులు వస్తున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఏకకాలంలో వర్తించవు. ఈ నాలుగు రోజుల్లో బ్యాంక్ పని ఉన్నవారు ఏ రోజులో తమ బ్యాంక్ వర్కింగ్‌లో ఉంటుంది.. ఏరోజున హాలీ డే ఉంటుందో తెలుసుకుంటే బెటర్.  ఇంతకీ ఈ 4 రోజుల్లో ఏయే రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఏరోజున హాలీ డే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 18 నుంచి 4 వరుస సెలవులు :


దేశంలో కృష్ణాష్టమి వేడుకలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తేదీల్లో జరుపుకుంటున్నారు. దీంతో కృష్ణాష్టమి హాలీ డే ఒక్కో రాష్ట్రంలో బ్యాంకులకు ఒక్కోలా ఉంది.


ఆగస్టు 18 (గురువారం)న భువనేశ్వర్, డెహ్రాడూన్, లక్నో, కాన్పూర్, మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్ఠమి హాలీ డే ఉంటుంది. కాబట్టి ఆరోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.


ఆగస్టు 19 (శుక్రవారం)వ తేదీన చెన్నై, చంఢీగఢ్, అహ్మదాబాద్, భోపాల్, జమ్మూకశ్మీర్, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, షిమ్లాల్లో బ్యాంకులకు జన్మాష్ఠమి హాలీ డే ఉండనుంది.


హైదరాబాద్‌లో ఆగస్టు 20 (శనివారం)వ తేదీన బ్యాంకులకు జన్మాష్ఠమి హాలీ డే ఉంటుంది.


ఇక ఆగస్టు 21 ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు అనే విషయం తెలిసిందే.


ఆగస్టు నెలలో పూర్తి సెలవుల జాబితా ఇదే :


ఆగస్ట్ 1, 2022: గ్యాంగ్‌టక్‌లో మాత్రమే సెలవు (దృప్కా తెషీ పండగ)


ఆగస్టు 7, 2022: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.


8 ఆగస్టు 2022: మొహర్రం సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.


ఆగస్ట్ 9, 2022: చండీగఢ్, డెహ్రాడూన్, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, పనాజీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురంలోని బ్యాంకులకు మొహర్రం సెలవు.


ఆగస్టు 11, 2022: రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు


12 ఆగస్టు 2022: కొన్ని రాష్ట్రాల్లో ఈరోజున రక్షా బందన్ సెలవు.


ఆగస్టు 13, 2022: నెలలో రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.


ఆగస్టు 14, 2022: ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు


15 ఆగస్టు 2022: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.


16 ఆగస్టు 2022: పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ముంబై, నాగ్‌పూర్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు.


ఆగస్టు 18, 2022: జన్మాష్టమి సందర్భంగా  భువనేశ్వర్, డెహ్రాడూన్, లక్నో, కాన్పూర్, మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని బ్యాంకులకు హాలీ డే ఉంటుంది.


19 ఆగస్టు 2022: రాంచీ, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్‌లోని బ్యాంకులకు జన్మాష్ఠమి సెలవు.


20 ఆగస్టు 2022: హైదరాబాద్‌లో ఈరోజున జన్మాష్ఠమి సెలవు.


ఆగస్టు 21, 2022: ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.


27 ఆగస్టు 2022: రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.


28 ఆగస్టు 2022 - ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.


29 ఆగస్టు 2022: శ్రీమంత్ శంకర్‌దేవ్ పండగ (గౌహతిలో మాత్రమే సెలవు)


ఆగస్టు 31, 2022: గణేష్ చతుర్థి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.


Also Read: Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. ఈనెల 21న మునుగోడుకు అమిత్ షా


Also Read: Viral Video : మద్యం మత్తులో నాలాలో బొక్కబోర్లా పడ్డ వ్యక్తి.. అదృష్టం కొద్ది ఎలా బతికి బయటపడ్డాడో చూడండి...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook