Ayushman Card: వివిధ ప్రైవేట్ కంపెనీలు అందించే మెడికల్ ఇన్సూరెన్స్ కార్డుల ప్రీమియం అందరూ భరించలేరు. వైద్య ఖర్చుల్ని సామాన్యులకు ఉపశమనం కల్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అందించే మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు ఇది. ఈ పధకం పూర్తి పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. మీక్కూడా ఈ కార్డు కావాలంటే ఆన్‌లైన్ విధానంలో కేవలం 5 నిమిషాల్లో ఇలా పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డు సహాయంతో ఉచితంగా వైద్య చికిత్స తీసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో మీరు కూడా ఆయుష్మాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ కార్డు అందరికీ వర్తించదు. ఏడాది ఆదాయం 1 లక్షరూపాయల్లోపు ఉండేవారికే ఆయుష్మాన్ కార్డు అందుతుంది. ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పధకాల లబ్దిదారులు అయుండకూడదు. ఈ రెండు షరతులకు లోబడి ఉండే కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ కార్డు లభిస్తుంది. ఆయుష్మాన్ కార్డుకు అప్లై చేసే ముందు అసలు మీరు అర్హులా కాదా అనేది  ఆయుష్మాన్ యాప్ ద్వారా లేదా 14555కు డయల్ చేసి తెలుసుకోవచ్చు.


ఆయుష్మాన్ కార్డు కోసం అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ అవసరమౌతాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఆయితే ఇంట్లో కూర్చుని ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముందుగా అధికారిక వెబ్‌సైట్ nha.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు కన్పించే పేజీలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో  వెరిఫై చేసుకోవాలి. దాంతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తరువాత లబ్దిదారుల పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్కీమ్, రాష్ట్రం, జిల్లా ఎంచుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఆయుష్మాన్ కార్డు జాబితాలో మీ పేరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి పేరు చెక్ చేసుకోవాలి. మీ పేరు లేదా మీ కుటుంబంలో వ్యక్తి పేరు కన్పించాక ఎవరిపేరుతో ఆయుష్మాన్ కార్డు కావాలో అక్కడ ప్రెస్ చేయాలి. మీ పేరుతో కావాలనుకుంటే ఆధార్ నెంబర్‌ను ఓటీపీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 


వెరిఫికేషన్ పూర్తయ్యాక మ్యాచింగ్ స్కోరు కన్పిస్తుంది. ఆ స్కోరు 80 శాతం దాటి ఉంటే మీ ఆయుష్మాన్ కార్డు ఆటోమేటిక్‌గా అప్రూవ్ అయిపోయినట్టే. ఆ తరువాత ఫోటో క్యాప్చర్ ఆప్షన్‌లో వెళ్లి ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం సమాచారం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అంతే ఆయుష్మాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్టే. మరోసారి లాగిన్ అయి ఆయుష్మాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also read: IT Warning: ట్యాక్స్ పేయర్లు మే 31లోగా ఆ పని చేయకుంటే రెట్టింపు టీడీఎస్ కట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook