home appliances prices hike news: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి మన్నికగల వినియోగ వస్తువుల (Consumer durables) ధరలు పెరిగాయి. ముడిపదార్థాల ధరలు, రవాణా ఛార్జీలు పెరగడమే ఇందుకు కారణం. మార్చి నాటికి వాషింగ్‌ మెషీన్ల వంటి గృహోపకరణాల (Home Appliances) ధరలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ప్యానాసోనిక్‌ (Panasonic), ఎల్‌జీ ( LG), హైయర్‌ ( Haier) వంటి సంస్థలు ధరల్ని పెంచాయి. సోనీ, హిటాచీ, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఈ త్రైమాసికం చివరి నాటికి ఆ దిశగా నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని '‘కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, అండ్‌ అప్లయన్సెస్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌' (CEAMA)’ అంచనా వేసింది. జనవరి నుండి మార్చి మధ్య మన్నికగల వినియోగ వస్తువుల ధరలు 5-7% పెరిగే అవకాశం ఉందని సీఈఏఎంఏ పేర్కొంది. 


Also Read: Hotel Mandarin Oriental: అమెరికాలోని ప్రముఖ లగ్జరీ హోటల్ చేజిక్కించుకున్న రిలయన్స్ సంస్థ


నిర్వహణ ఖర్చులు, రవాణా ఛార్జీలు, ముడిపదార్థాల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయని హైయర్ అప్లెయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీశ్ పీటీఐకి తెలిపారు. దీంతో రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్ల ధరలు 3-5 శాతం పెరుగుతాయన్నారు. ఇప్పటికే ప్యానాసోనిక్‌ ఏసీలపై 8 శాతం ధరల పెంచేసింది. మరోమారు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నది. మిగతా హోం అప్లియెన్సెస్ ధరలను (Home Appliances Prices) పెంచాలని యోచిస్తున్నాయి. మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే..ఏప్రిల్‌, మే నెలల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని సీఈఏఎంఏ తెలిపింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook