Bajaj Finance Hikes FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బజాజ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివిధ కాల పరిమితులకు ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ రేట్లను 60 బీపీఎస్ వరకు పెంచింది. అత్యధిక వడ్డీ రేటుగా 8.85 శాతం అందజేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 42 నెలల కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.85 శాతం వడ్డీని అందజేస్తోంది. ఎంపిక చేసిన టైమ్ పీరియడ్‌లో సీనియర్ సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీని 60 బేసిక్ పాయింట్లకు పెంచింది. సంస్థలో భాగమైన బజాజ్ ఫిన్ సర్వ్ చాలా వరకు తమ వివిధ కాల పరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపుదలను ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rains: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు


ఏప్రిల్ 3, 2024 నుంచి కంపెనీ సీనియర్ సిటిజన్లకు 25 నుంచి 35 నెలల కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటును 60 బేసిస్ పాయింట్ల వరకు, 18 నుంచి 24 నెలలు కాల పరిమితి గల ఎఫ్‌డీలపై 40 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ కస్టమర్లకు 25 నుంచి 35 నెలల కాల పరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 45 బేసిస్ పోయింట్లు, 20 నుంచి 35 నెలల కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు, 30 నుంచి 33 నెలల కాల వ్యవధి ఉన్న వాటిపై వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.


బజాజ్ ఫైనాన్స్ ఈ నిర్ణయంతో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో సేవింగ్స్‌ చేసేవారికి స్థిరమైన, మెరుగైన ఆదాయం పొందేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సీనియర్ సిటిజన్లు 8.85% వరకు ఎఫ్‌డీ రేట్లను పొందడం కొనసాగించవచ్చు. ఇతర కస్టమర్లు 42 నెలల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలను డిజిటల్‌గా బుక్ చేసుకోవడం ద్వారా 8.60 శాతం వడ్డీ రేటు పొందవచ్చు.


బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు & ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ సచిన్ సిక్కా మాట్లాడుతూ.. అనేక ఇన్వెస్ట్‌మెంట్ బకెట్లలో తాము పెంచిన వడ్డీ రేట్లు స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని వెల్లడించారు. కొన్నేళ్లుగా మిలియన్ల మంది డిపాజిటర్లు బజాజ్ బ్రాండ్‌పై తమ నమ్మకాన్ని ఉంచారని తెలిపారు. తాము వారికి మెరుగైన సేవలు, వారి పొదుపు కోసం సురక్షితమైన ఎంపికను అందించడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మార్చి 31, 2024 నాటికి బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ ప్రాంచైజీ సుమారు 83.64 ఎంఎంగా ఉందని.. 60 వేల కోట్లను డిపాజిట్ల రూపంలో స్వీకరించి కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లను స్వీకరించిన NFBC గా అవతరించిందన్నారు.


Also Read:  PM Modi Fan Cut His Finger:మోదీ హ్యట్రిక్ పీఎం కావాలి.. వేలుకోసుకొని కాళీకా దేవికి అర్పించిన అభిమాని.. ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook