Bajaj pulsar 180 roadster: బజాజ్ పల్సార్ కొత్త బైక్ మార్కెట్లో త్వరలో..ధర ఎంతో తెలుసా
Bajaj pulsar 180 roadster: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ అంటేనే గుర్తొచ్చేది పల్సార్ బైక్. పల్సార్ బైక్ అంటే యూత్‌లో యమ క్రేజ్. పల్సార్ పేరుతో ఎన్ని వెర్షన్స్ వచ్చినా మార్కెట్లో హిట్ అవుతుంటాయి. ఇప్పుడు బజాజ్ సంస్థ మరో కొత్త పల్సార్‌ను విడుదల చేయనుంది. ధర ఎంతో తెలుసా..
Bajaj pulsar 180 roadster: ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ అంటేనే గుర్తొచ్చేది పల్సార్ బైక్. పల్సార్ బైక్ అంటే యూత్‌లో యమ క్రేజ్. పల్సార్ పేరుతో ఎన్ని వెర్షన్స్ వచ్చినా మార్కెట్లో హిట్ అవుతుంటాయి. ఇప్పుడు బజాజ్ సంస్థ మరో కొత్త పల్సార్‌ను విడుదల చేయనుంది. ధర ఎంతో తెలుసా..
బజాజ్ పల్సార్ బైక్ ( Bajaj pulsar bike ). యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఓ బ్రాండ్. ఇప్పుడు బజాజ్ సంస్థ మరో పల్సార్ బైక్ విడుదల చేస్తోంది. త్వరలో బజాజ్ పల్సార్ 180 సిసి బైక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. బజాజ్ పల్సార్ 180 రోడ్‌స్టర్ ( Bajaj pulsar 180 roadster ) పేరుతో వస్తోందిది. ఇప్పటికే కంపెనీ ఇదే విభాగంలో పల్సార్ 180 ఎఫ్ నియాన్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు త్వరలో లాంచ్ చేయనున్న పల్సార్ రోడ్‌స్టర్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హోండా హార్నెట్ 2.0, టీవీఎస్ అపాచీ 160, సుజుకి జిక్సెర్ 155 బైక్‌లతో పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ బైక్ ఫీచర్ల ( Bajaj pulsar features )ను పరిశీలిస్తే..178.6 సిసి సింగిల్ సిలండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. 16.6 బీహెచ్ పి పవర్, 14.52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంది. ఈ బైక్ హాలోజన్ హెడ్‌లైట్, లైట్ కలర్ విజర్, ట్విన్ డీఆర్ఎల్‌తో కూడిన ఇంధన ట్యాంక్, ఇంజన్ కౌల్, స్ప్లిట్ ఫ్లైట్ సీట్లతో రానుంది. ఎక్స్ షోరూం ధర 1 లక్షా 5 వేల 216 రూపాయలుగా ఉండనుంది. డిజైనర్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సెక్యూరిటీ కోసం బజాజ్ పల్సార్ రోడ్‌స్టర్‌కు ముందు, వెనుక చక్రాల్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫోర్కులుంటాయి.
Also read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook