Bank Holiday in January 2023: మరో ఐదు రోజుల్లో 2022 ముగిసి.. కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో 2023 జనవరిలో ఏమైనా బ్యాంక్ లావాదేవీల గురించి మీరు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన జాబితా ఓసారి చెక్ చేయాల్సిందే. 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసింది. ఏ నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులు ఉంటాయో వెల్లడించింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ఈ క్యాలండర్‌ ఆధారంగా మీ కార్యచరను సిద్దం చేసుకుంటే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్‌బీఐ క్యాలండర్‌ ప్రకారం..  2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగు శనివారంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేయవు. న్యూఇయర్‌ వేడుకలు, గణతంత్ర దినోత్సవం, ఇమోయిను ఇరట్పా, గాన్-నగైలు వంటి ప్రత్యేకమైన రోజుల్లో నేషనల్‌ హాలిడేస్‌ ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. సెలవు దినాల్లో బ్యాంకుల్లో అత్యవసర పనులుంటే.. ముందే పూర్తి చేసుకోవాలని, లేదంటే మరో రోజుకు వాయిదా వేసుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జనవరిలో మొత్తంగా 8 సెలవులు ఉన్నాయి. సంక్రాంతి పండుగతో పాటు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అధికారిక సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు బ్యాంకులకు కూడా వర్తిస్తాయి. ఇవి కాకుండా సాధారణ సెలవులు కూడా ఉంటాయి. భోగి పండుగ రెండో శనివారం రాగా.. సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చింది. దాంతో ఈ పండుగల సందర్భంగా వచ్చే సెలవులు సాధారణ సెలవుల్లో కలిసిపోయాయి.


జనవరిలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవుల జాబితా:
జనవరి 1- ఆదివారం


జనవరి 8- ఆదివారం


జనవరి 14- రెండో శనివారం (భోగి)


జనవరి 15- ఆదివారం (సంక్రాంతి)


జనవరి 22- ఆదివారం


జనవరి 26- రిపబ్లిక్ డే


జనవరి 28- నాలుగో శనివారం


జనవరి 29- ఆదివారం


Also Read: Urfi Javed New Video: ప్లేట్, గ్లాస్ అడ్డుపెట్టి.. బ్రేక్ ఫాస్ట్ అంటూ ఊరించేస్తున్న ఉర్ఫీ జావేద్!  


Also Read: Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఈసారి మూడు హాలిడేస్ మిస్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.