Bank Holidays: నవంబర్‌లో 9 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే
Bank Holidays in November: ఇటీవలి కాలంలో ఆన్లైన్ లావాదేవీలు అధికమయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌తో బ్యాంక్ లావాదేవీలు జరిగిపోతున్నాయి. అయినా సరే కొన్ని పనులుంటే బ్యాంకులకు వెళ్లక తప్పదు. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
Bank Holidays in November: మరో వారం రోజుల్లో అక్టోబర్ నెల ముగియనుంది. ఈ క్రమంలో నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఉన్నట్టు ఈసారి బ్యాంకులకు పెద్దగా సెలవులు లేవనే చెప్పాలి. నవంబర్ నెలలో బ్యాంకులకు 9 రోజులు సెలవులున్నాయి. ఆ జాబితా ఓసారి చెక్ చేద్దాం
నవంబర్ నెలలో బ్యాంకు పనులుంటే మాత్రం ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. నవంబర్ నెలలో బ్యాంకులకు 9 రోజులు సెలవులున్నాయి. ఇందులో రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు ఇతర సెలవులున్నాయి.
నవంబర్ 1 దీపావళి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
నవంబర్ 2 శనివారం దీపావళి సెలవు
నవంబర్ 3 ఆదివారం సెలవు
నవంబర్ 9 రెండవ శనివారం బ్యాంకులకు సెలవు
నవంబర్ 10 ఆదివారం సెలవు
నవంబర్ 15 గురునానక్ జయంతి సెలవు
నవంబర్ 17 ఆదివారం సెలవు
నవంబర్ 23 నాలుగవ శనివారం సెలవు
నవంబర్ 24 ఆదివారం సెలవు
Also read: Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.