Bank Holidays June 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. పబ్లిక్ హాలిడేస్ కాకుండా ప్రాంతీయ సెలవులుంటాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అందుకే బ్యాంకు పనులుంటే ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకులకు 10 రోజుల వరకూ సెలవులున్నాయి మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరుగుతున్నా ఏదో పని నిమిత్తం బ్యాంకులు వెళ్లాల్సిన అవసరం వస్తోంది. మరో పదిరోజుల్లో మే నెల ముగిసి జూన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జూనా్ నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ జారీ అయింది. ఈసారి జూన్‌లో 10 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాల రూపంలో ఆరు రోజులు మినహాయిస్తే మరో నాలుగు రోజులు సెలవులున్నాయి. రాజా సంక్రాంతి, బక్రీద్ వంటి పండుగలు జూన్ నెలలోనే ఉన్నాయి. జూన్‌లో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నా ఏటీఎంలు పనిచేస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఇబ్బంది ఉండదు. 


జూన్ 2024 బ్యాంకు సెలవులు


జూన్ 2 ఆదివారం బ్యాంకులకు సెలవు
జూన్ 8 రెండవ శనివారం సెలవు
జూన్ 9 ఆదివారం సెలవు
జూన్ 15 రాజా సంక్రాంతి సందర్భంగా మిజోరాం, ఒడిశాలో సెలవు
జూన్ 16 ఆదివారం సెలవు
జూన్ 17 ఈద్ ఉల్ అజ్హా లేదా బక్రీద్ సెలవు
జూన్ 18 జమ్ము కశ్మీర్‌లో బక్రీద్ సెలవు
జూన్ 22 నాలుగవ శనివారం సెలవు
జూన్ 23 ఆదివారం సెలవు
జూన్ 30 ఆదివారం సెలవు


Also read: Jio Prepaid plan Offers: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకుంటే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, జీ5



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook