బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పకుండా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. ఏ మాత్రం బ్యాలెన్స్ లేకపోయినా నిర్దాక్షిణ్యంగా జరిమానాలు పడుతున్నాయి. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండకపోవచ్చని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవంత్ కిషన్‌రావ్ కరాడ్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు మీ బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల తరచూ జరిమానాలు చెల్లిస్తున్నారా..ఇకపై ఆ పరిస్థితి ఉండదు. త్వరలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి నుంచి విముక్తి పొందవచ్చు. బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది బ్యాంకును బట్టి ఒక్కోలా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించిన జనధన్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. 


మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విషయమై ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై జరిమానాను తొలగించే నిర్ణయాన్ని త్వరలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ బ్యాంక్స్ తీసుకోవచ్చని మంత్రి తెలిపారు. బ్యాంకులు పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలని చెప్పారు. అందుకే త్వరలో బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై జరిమానా తొలగించేందుకు నిర్ణయించవచ్చన్నారు.


ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి కరాడ్‌ను మీడియా ప్రతినిధులు ఇదే విషయం ప్రశ్నించారు. మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై జరిమానా విధించకుండా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్ని ఆదేశించనుందా అని మీడియా ప్రశ్నించింది. ఈ విషయంపై బ్యాంకులే నిర్ణయం తీసుకోవచ్చని ఆయన చెప్పారు. బ్యాంకులు స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంటే చిన్న చిన్న కస్టమర్లు అందరికీ ప్రయోజనం కలగనుందన్నారు. 


Also read: Flipkart Deals: థామ్సన్ వాషింగ్ మెషీన్‌పై భారీ డిస్కౌంట్,, కేవలం 5 వేలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook