Bank Holidays: వారమంటే ఇలా ఉండాలి. ఒక్క రోజు పని చేస్తే చాలు. వారం రోజులు వరుస సెలవులు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం మినహా మిగతా ఐదు రోజులు సెలవులు రావడం విశేషం. దీంతో బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. వరుస సెలవులతో యాత్రలకు ప్రణాళికలు వేసుకున్నారు. చాలా నెలల తర్వాత ఇన్ని సెలవులు లభిస్తుండడంతో ఉద్యోగులు కుటుంబంతో సహా విహారానికి వెళ్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Family Star: విజయ్‌ దేవరకొండనే టార్గెట్‌.. ఫేక్‌ న్యూస్‌పై 'ఫ్యామిలీ స్టార్‌' టీమ్‌ పోరాటం


ఒక్కరోజే పనిదినం
ఈ వారంలో 5 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో వారంలో 5 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులు వరుసగా సెలవులు వచ్చాయి. 

Also Read: Rains: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు


సెలవులు ఇవే..


ఏప్రిల్ 9: మంగళవారం గుడి పడ్వా, ఉగాది
ఏప్రిల్ 10: బుధవారం బోహాగ్ బిహు, ఈద్‌
ఏప్రిల్ 11: గురువారం రంజాన్
ఏప్రిల్ 13 రెండో శనివారం
ఏప్రిల్ 14 ఆదివారం


ఈనెలలో మరికొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ అధికారులు కస్టమర్లకు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు అత్యంత జాగ్రత్తగా చేసుకోవాలని సూచిస్తున్నాయి. అత్యవసరమైతేనే చేసుకోవాలని లేనిపక్షంలో బ్యాంకు పనివేళల్లో లావాదేవీలు జరపాలని చెబుతున్నాయి. భారీ లావాదేవీలు మాత్రం బ్యాంకుల్లో మాత్రమే చేయాలని బ్యాంకు నిపుణులు సూచనలు చేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి