Top Beer Brands In India:  దేశంలో బీర్ ప్రియుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పగలంతా కష్టపడి రాత్రి కాగానే చల్లని బీర్‌ ఒకటి కొడితే కలిగే ఆనందం గురించి మాట్లలో చెప్పలేము. ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు చేస్తుంటారు. మద్యం దుకాణాల ముందు భారీ సంఖ్యల్లోజనాలు క్యూలు కడుతుంటారు. మద్యంపై విధించే వివిధ రకాల పన్నుల వల్ల రాష్ట్రాలకు భారీ ఆదాయం వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా భారతదేశంలో ఎక్కువగా ఏ బ్రాండ్‌ బీర్‌లు అమ్ముడు పోతాయని. అయితే మీరు ఈ టాప్‌ బీర్‌ బ్రాండ్‌ల గురించి వెంటనే తెలుసుకోవాలి. ఇంతకీ ఏ బ్రాండ్‌ మన దేశంలో ఫేమస్‌ అనేది తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశంలో ఎక్కువగా మంది బీర్‌ ప్రియలు అతి తక్కువ ఆల్కహాల్‌ను తాగడానికి ఇష్టపడుతారని ఒక అధ్యయనంలో తేలింది. అతి తక్కువ ఆల్కహాల్‌ కలిగే బీర్‌లో బడ్‌వైజర్ ఒకటి. ఇందులో 2 శాతం ఆల్కహాల్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.  బీర్‌ అమ్ముడయ్యే వాటిలో ఇది ఐదవ స్థానంలో ఉంది.  నెక్స్ట్ ఫేమస్‌ బీర్‌ కళ్యాణి బ్లాక్‌ లేబుల్‌. ఇది ఎక్కువగా పశ్చిన బెంగాల్‌ లో దొరుకుతుంది. ఈ బీర్‌కు ఎంతో మంది ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. బెంగాల్‌తో పాటు తూర్పు రాష్ట్రాల్లో దీనికి క్రేజ్‌ ఎక్కువ. ఈ బ్రాండ్ బీర్‌ అమ్మకాల్లో నాలుగో స్థానంలో ఉంది. 


మరో అద్భుతమైన బీర్‌లో నాక్ అవుట్‌ ఒకటి. ఇది టాప్‌ ఐదు బ్రూయింగ్‌ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ దేశంలో అత్యధికంగా ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. బీర్‌ అమ్మడయ్యే వాటిలో ఇది మూడవ స్థానంలో ఉంది. హేవర్డ్స్ ఎంతో ప్రసిద్ధి చెందిన బ్రాండ్. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఇది బీర్‌ అమ్ముడయ్యే వాటిలో రెండవ స్థాన్నాని సంపాదించుకుంది. 


ఇప్పుడు ప్రతి బీర్‌ లవర్స్‌కనెక్ట్ అయ్యే బ్రాండ్‌ కింగ్ ఫిషర్‌. ఇది భారతదేశంలో మొదట లాంచ్‌ అయిన బీర్‌. ఈ బ్రాండ్‌ను విజయ్ మాల్యా ప్రారంభించారు.  ఈ బీర్‌ దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే బీర్‌. దీని ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 


అయితే బీర్‌లను ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నవారు ఈ మత్తు పదార్థాలకు అడిక్ట్ అవుతున్నారు. చిన్న వయసు నుంచే ఇలా హానికరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. బీర్ తాగేటప్పుడు మితంగా తాగడం ముఖ్యం. అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం.


Also Read: Post Office Saving Schemes: పిల్లల కోసం పోస్టాఫీస్‌ బంపర్ ఆఫర్ స్కీమ్‌.. రూ.500తో స్టార్‌ చేస్తే జాక్పాట్‌ కొట్టినట్లే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.