ITR benefits: దేశంలో వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు.. అంతకన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న 60 ఏళ్ల లోపు వారికి ఆదాయపు పన్ను మినహాయింపు వర్తింస్తుంది. ఈ పరిమితికి మించి సంపాదించే ప్రతి ఒక్కరు ఇన్​కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్​) దాఖలు చేయడం తప్పనిసరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆదాయం తక్కువగా ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. మరి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల లభించే ప్రయోజనాలు ఏమింటి? ఇప్పుడు తెలుసుకుందాం.


ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఉపయోగాలు..


రుణాలు త్వరగా లభిస్తాయి: ఏదైనా బ్యాంకుకు మీరు లోన్​ లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ అర్థిక స్తోమత ఆధారంగా లోన్​ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తాయి. తక్కువ ఆదాయం ఉంటే లోన్ ఇచ్చేందుకు మొగ్గు చూపవు.


అలాంటప్పుడు.. మీరు ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్​ను బ్యాంక్​కు సమర్పించొచ్చు. ఐటీఆర్ ఉంటే మీకు ఆర్థిక క్రమ శిక్షణ ఉందని.. బ్యాకులు రుణాలు ఇస్తాయి. ముఖ్యంగా గృహ రుణాలు, కార్​ లోన్​్ వంటి వాటికి ఐటీఆర్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.


పన్ను ఆదా, రీఫండ్​..


మీరు ఐటీఆర్ దాఖలు చేస్తే.. పొదుపు పథకాలైనపై లభించే టర్మ్​ డిపాజిట్లపై పన్ను రాయితీని పొందొచ్చు.


మీకు వివిధ ఆదాయ మార్గాల ద్వారా వార్షికంగా రూ.2.5 లక్షల ఆదాయం వస్తే.. దానిపై వర్తించే టీడీఎస్​ను.. ఐటీఆర్ ఫైల్ చేసి రీఫండ్ కోరొచ్చు.


ఆదాయపు దృవపత్రంగా..


సంఘటిత రంగాల్లో ఉద్యోగులకు సమర్పించే ఫారం-16 ఉద్యోగుల ఆదాయపు ధ్రువపత్రంగా వినియోగించుకోవచ్చు. స్వయం ఉపాధి పొందేవాళ్లు కూడా... ఐటీఆర్ ఫైల్ చేసి..  దానిని ఆదాయపు ధ్రువపత్రంగా వాడుకోవచ్చు.


వీసా త్వరగా పొందొచ్చు..


విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు (ఉద్యోగం సహా ఇతర అవసరాలకు).. వీసా ఇచ్చేందుకు వివిధ దేశాలు ఐటీఆర్​ను కోరతాయి. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి వీసాలు త్వరగా లభిస్తుంటాయి.


అంటే ఐటీఆర్ వీసా ధరఖాస్తుతో పాటు పంపిస్తే.. వాళ్లకు మీ ఆదాయపు వనరులు, మీ ఆర్థిక అలవాట్లపై పూర్తి అవగాహన వస్తుంది. దీనితో వీసా ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అంతే వేగంగా మంజూరు కూడా అవుతుంది.


Also read: New EPF Rules: ఏప్రిల్ నుంచి మారనున్న పీఎఫ్​ రూల్స్​.. పూర్తి వివరాలు ఇవే..


Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook