Best 7 Seater Car in India 2023, Buy Hyundai Alcazar Under 16 Lakhs: భారతీయ కార్ మార్కెట్‌లో 7 సీటర్ కార్లు నిత్యం వస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ సెగ్మెంట్‌ను శాసిస్తుండగా.. మరికొన్ని కంపెనీలు కొత్త వాహనాలు ప్రారంభిస్తున్నాయి. మారుతి సుజుకికి చెందిన 'ఎర్టిగా' ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెవెన్ సీటర్ కారు. కియా మోటార్స్ మరియు టయోటా కూడా ఈ సెగ్మెంట్‌లో తమ కార్లను విక్రయిస్తున్నాయి. అయితే హ్యుందాయ్‌లో సెవెన్ సీటర్ కారు కూడా ఉందని, బేస్ వేరియంట్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యుందాయ్ సెవెన్ సీటర్ కారు మరేదో కాదు.. అల్కాజార్ ఎంపీవీ (Hyundai Alcazar). ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ అల్కాజార్ కారుకి ప్రత్యక్ష పోటీ ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారి మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి కార్లు ఉన్నాయి. ఈ కారు ధర బేస్ మోడల్‌కు రూ. 16.10 లక్షలుగా ఉంది. అదేవిధంగా టాప్ మోడల్‌కు రూ. 21.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.


అల్కాజార్ ఎంపీవీ కారు 6 మరియు 7 సీట్ల లేఅవుట్‌లలో లభిస్తుంది. ఆల్కాజర్ ముందు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ మరియు రెండవ వరుసలో స్టోరేజ్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది యాంబియంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది.


హ్యుందాయ్ కంపెనీ ఈ కారులో రెండు ఇంజన్ ఎంపికలను అందించింది. 2-లీటర్ పెట్రోల్ (159PS/191Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS/250Nm)లు ఇందులో ఉంటాయి. ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు డ్రైవ్ మోడ్‌లు (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) ఉన్నాయి.


Also Read: టీమ్ మేనేజ్‌మెంట్‌కు అతడి ఫామ్ తెలుసు.. మూడో టెస్టులో శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి: రవిశాస్త్రి    


Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.