Best Deals In Amazon Freedom Sale 2023: అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉంది. ఈ సేల్ లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్ నాన్-ప్రైమ్ మెంబర్స్ కి 4 తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ లో ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ప్రముఖ టెక్ బ్రాండ్ అయిన iPhone, OnePlus, Redmi, iQOO, Samsung స్మార్ట్ ఫోన్లపై రూ. 2,500 వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వారికి ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదనపు డిస్కౌంట్ పొందడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచి స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా మొబైల్ ఫోన్స్ ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, గృహోపకరణాలపై కూడా అన్ని ఆఫర్లతో కలిసి 30% తగ్గింపు లభిస్తోంది. ఇక తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్సేల్ లో ఉత్తమమైన స్మార్ట్ఫోన్ డీల్స్ ను మీ ముందుకు తీసుకు వచ్చాము. ఈ డీల్స్ ఏంటో? వాటికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్:
✤ ఈ సెల్ లో భాగంగా ఐఫోన్ 14 128 జిబి స్టోరేజ్ కలిగిన మోడల్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను సాధారణ రోజుల్లో అమెజాన్ రూ. 79,900 విక్రయించగా.. ఈ సేల్ లో కేవలం రూ. 66,999లకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై దాదాపు  రూ.12,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.


✤ ఐఫోన్ 12 64 జిబి స్టోరేజ్ మోడల్ పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సెల్ లో భాగంగా మీరు ఈ మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 5,901 తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 59,900లకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 53, 999లకే లభిస్తోంది. 


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..


✤ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఈ సేల్ లో భాగంగా OnePlus Nord CE 3 మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తే..రూ. 26,999 కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 24,999లకే లభిస్తోంది.


✤ బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువగా ఉన్న స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. అయితే మీరు కూడా తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన iQOO Z6 Lite స్మార్ట్ ఫోన్ ఈ సేల్ లో కేవలం రూ. 12,499లకే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ను పొందేందుకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook