Best Electric Bike 2022, You Can travel 300 KM on Ultraviolette F77 Electric Bike with Full Charge: ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు 2022 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చాయి. కార్ల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు ఈ సంవత్సరం కొత్త సంస్థలు మరియు మోడల్స్ ప్రారంభించబడ్డాయి. కొన్ని కంపెనీలు అద్భుత ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. 2022 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ 4 ఎలక్ట్రిక్ బైక్‌లు ఫుల్ ఛార్జితో 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించొచ్చు. వీటిలో ఒక బైక్ అయితే ఫుల్ ఛార్జితో 300 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఆ బైక్‌ల జాబితాను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oben Rorr:
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ ప్రారంభ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇందులో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు (ఎకో, సిటీ మరియు హవోక్) ఉన్నాయి. హవోక్ మోడ్‌లో గరిష్ట వేగం 100 కిమీ. ఇది 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 40Kmph వరకు వేగవంతం చేయగలదు.


Ultraviolette F77: 
అల్ట్రా వైలెట్ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రా వైలెట్-F77ను విడుదల చేసింది. దీని ధర రూ. 3.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 10.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌లో అతిపెద్ద బ్యాటరీ. ఫుల్ ఛార్జితో 307 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 


Tork Kratos:
ప్రస్తుతం టోర్క్ క్రాటోస్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర). జనవరి 2023 వరకు ఈ ధరలు ఇలానే ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 4 Kwh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. పూర్తి ఛార్జ్‌తో 180 కిమీ వెళ్లొచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ. ఈ బైక్ 4 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.


HOP OXO:
హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ 90Kmph గరిష్ట వేగంతో వెళుతుంది. టర్బో మోడ్ ద్వారా ఇది 4 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది 3.75kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జితో 150 కిలోమీటర్ల దూరం వెళుతుంది.


Also Read: Cheapest Phone: రూ. 350కే శాంసంగ్ ఫోన్.. అదనపు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు!


Also Read: Tulsi Plant Home Remedy: తులసి ఆకులతో ఈ ప్రత్యేక పరిహారం చేస్తే.. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అవుతారు! ట్రై చేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.