Simple One Electric Scooter gives 300 kilometers on Full Charge: భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. దాంతో పెద్ద పెద్ద కంపెనీలు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తున్నాయి. డిమాండ్ దృష్ట్యా చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లలో అతి పెద్ద సమస్య 'ఛార్జింగ్'. ఎప్పుడు స్కూటర్ ఛార్జ్ అయిపోతుందో, మార్గమధ్యంలో ఎక్కడ ఆగాల్సి వస్తుందో అని వినియోగదారులు భయపడుతున్నారు. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) మీ భయాందోళనలను దూరం చేసే స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ స్కూటర్ పేరు 'సింపుల్ వన్' (Simple One).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్కడ విశేషమేమిటంటే.. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సింపుల్ వన్ స్కూటర్‌ను గత ఏడాది ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం దీని విక్రయాలు మార్కెట్‌లో ఇంకా ప్రారంభం కాలేదు. ఈ స్కూటర్ 0 నుండి 40 కిమీ/గం వేగాన్ని అందుకోవడానికి 2.77 సెకన్లు పడుతుంది. సింపుల్ వన్ స్కూటర్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. 


సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2kWh యొక్క స్థిర బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాదు 1.6kWh యొక్క తొలగించగల బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 300 కిలోమీటర్లు వెళుతుంది. కరెంట్ బిల్ కూడా తక్కువే వస్తుందని పేర్కొంది. ఇది 8.5kW మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇది 11.3 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.


సింపుల్ వన్ స్కూటీని కంపెనీ వెబ్‌సైట్‌లో కేవలం రూ.1947తో బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా వాపసు చేయబడుతుంది. ఈ స్కూటర్ బ్యాటరీ మరియు ఛార్జర్‌పై కంపెనీ మూడేళ్ల వారంటీని ఇస్తోంది. ఇది అన్ని-LED లైటింగ్, 30-లీటర్ స్టోరేజ్, స్వాప్ చేయగల బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 7-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను కలిగి ఉంది.


పలు నివేదికల ప్రకారం... ఈ ఏడాది మార్చి నాటికి సింపుల్ వన్ స్కూటర్‌ను సింపుల్ ఎనర్జీ కంపెనీ విడుదల చేయనుంది. సింపుల్ వన్ స్కూటర్‌ ఉత్పత్తి జనవరి నుంచి ప్రారంభమవుతుంది. తమిళనాడులోని శులగిరిలో రూ.100 కోట్లతో కంపెనీ ఈ స్కూటర్ ప్లాంటును ఏర్పాటు చేసింది. సింపుల్ వన్ స్కూటర్ ధర 1.45 లక్షలు ఉండే అవకాశం ఉంది.


Also Read: Shash Mahapurush Yog 2023: జనవరి 17న శష యోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు! తరగని సంపద సొంతం


Also Read: IND vs SL 3rd T20: శుభ్‌మాన్ గిల్‌ ఔట్.. స్టార్ ప్లేయర్ ఇన్! మూడో టీ20కి భారత తుది జట్టు ఇదే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.