Ampere plans to Release 7 New Electric Scooters under Rs 85000: భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) నంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించింది. ఇతర ఎలక్ట్రిక్ కంపెనీలు కూడా తమ మార్కెట్‌ను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్‌కు చెందిన 'ఆంపియర్' (Ampere) కంపెనీ ఓలా తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఆంపియర్ తన మార్కెట్ వాటాను పెంచడానికి కొన్ని కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటు ధరలో మరియు ప్రీమియం కేటగిరీలో ఉంటాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నగేష్ బసవనహళ్లి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంపియర్ కంపెనీ తన బ్రాండ్ పేరుతో Ampere Primu, Ampere Magnus EX మరియు Ampere Rio Plus వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పటికే విక్రయిస్తుంది. కంపెనీ 'ఆటో ఎక్స్‌పో' 2023లో (Auto Expo 2023) Ampere NXG మరియు Ampere NXUతో సహా 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. ఇది కాకుండా కొత్త ఆంపియర్ ప్రైమస్ ఇ-స్కూటర్ కూడా ప్రదర్శించబడింది.


కొన్నేళ్ల క్రితం కంపెనీ ఎలక్ట్రిక్ ట్రావెల్ ప్రారంభించినప్పుడు వార్షిక ఆదాయం దాదాపు రూ.18 కోట్లుగా ఉందని, గత త్రైమాసికంలో అది రూ. 320 కోట్లకు పెరిగిందని ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నగేష్ బసవనహళ్లి తెలిపారు. మాగ్నస్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 1,00,000 కంటే ఎక్కువ యూనిట్లు విక్రయించబడ్డాయట. దాంతో ఉత్పత్తులు బాగా పెరిగాయని ఆయన తెలిపారు. ఇప్పుడు మాగ్నస్ కాకుండా.. కొత్తదనాన్ని తీసుకొస్తున్నామని నగేష్ పేర్కొన్నారు. 


ఇప్పటి వరకు కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాల ధర రూ. 85,000 నుంచి రూ.లక్ష వరకు ఉండేదని నగేష్ బసవనహళ్లి తెలిపారు. ఇప్పుడు తక్కువ ధరతో పాటు ఎక్కువ ధరలతో కూడిన వాహనాలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పెరుగుతోందని, గత ఏడాది దాదాపు 2.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఈ సంఖ్య 7 లక్షల యూనిట్లకు చేరుతుందని, వచ్చే ఏడాది దాదాపు 13 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. కంపెనీకి 13-14 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు.


Also Read: Mercury Transit 2023: మకర రాశిలో 'బుధాదిత్య యోగం'.. ఈ 4 రాశుల వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు!  


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్వల్పంగా పెరిగిన గోల్డ్ ధర! స్థిరంగా వెండి ధర  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.