Post Office Scheme: పోస్టాఫీసు పథకాలు అత్యంత సురక్షితమైనవి. రిటర్న్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. నెలకు 5 వేల పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం లక్షల్లో ఆర్జించే పథకాలున్నాయి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లు డిసెంబర్ 1 నుంచి పెరిగాయి. నెలవారీ పెట్టుబడితో లక్షల్లో సొమ్ము కూడబెట్టవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసే అవకాశముంటే ఎక్కడ ఎందులో పెట్టుబడి పెట్టాలనే సందిగ్దం ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ సమాచారం. నెలకు ఇలా చిన్నమొత్తంలో పొదుపు చేయడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొదుపు చేయవచ్చు. పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ పధకం ఇందుకు అందుబాటులో ఉంది. ఇటీవలే స్మాల్ సేవింగ్ పధకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచింది. 


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకాన్ని నెలకు కనిష్టంగా 100 రూపాయల్నించి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి ఏదీ లేదు. ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెలకు ఒకవేళ 5 వేల రూపాయలు పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేస్తుంటే 5 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి 3 లక్షల 56 వేల 830 రూపాయలు జమ అవుతాయి. ఐదేళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసేది 3 లక్షలైతే వడ్డీ రూపంలో వచ్చేది 56 వేల 830 రూపాయలు. అదే ఆర్డీని మరో ఐదేళ్లు పొడిగిస్తే అంటే మొత్తం పదేళ్లకు 8,54,272 రూపాయలు చేతికి అందుతాయి. ఇందులో వడ్డీ మొత్తమే 2, 54, 272 రూపాయలుంటుంది. 


వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవలే నోటిఫికేషన్ వెలువరించింది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌పై 6.5 శాతం కాకుండా 6.7 శాతం వడ్డీ అందుతుంది. 


Also read: FD Schemes Interest Rates: స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌పై భారీ వడ్డీ రేట్లు.. ఆ రోజే లాస్ట్.. త్వరపడండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook