Best Investment Schemes: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా ఉపయోగపడుతుంది. 60 ఏళ్ల వయసు పైబడిన వారు పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడులు పెట్టి అధిక రాబడులు పొందేందుకు ఇదే మంచి అవకాశం. మరోవైపు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి (FD) అనేది టర్మ్ డిజిటల్ ప్లాన్ అందుబాటులో కలదు. అయితే ఈ రెండు స్కీమ్స్ ఒకేలా ఉంటాయి. లాక్ ఇన్ పీరియడ్ ఓకేలా ఉన్నా.. కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఈ రెండు స్కీమ్స్ ప్రయోజనాలు ఏమిటి? భవిష్యత్తులో ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలి? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ప్లాన్ అనేది తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..
ఇది గవర్నమెంట్ మద్దతుతో నడిచే సేవింగ్స్ స్కీమ్. కాబట్టి ఇందులో ఎలాంటి మతలబుకు వీలు లేదు. ఇది సురక్షితమైనది. ఇందులో పెట్టే పెట్టుబడికి భద్రత, భరోసా ఉంటుంది. 
1) ఇందులో పెట్టుబడి పెట్టే ఖాతాదారులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 
2) ఐదేళ్లు పూర్తయిన తర్వాత సేవింగ్స్ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. అయితే మరో మూడేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. 
3) SCSS ఖాతాను తెరవడం చాలా సులభం. ఈ ఖాతాను తెరిచే వ్యక్తులు దేశంలోని ఏదైనా ఆధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతాను తెరవచ్చు. తమ తమ ఖాతాలను దేశంలో ఎక్కడికైనా బదిలీ చేసుకునే సదుపాయం కలదు. 
4) ఇందులో కనీస డిపాజిట్ మొత్తం రూ. 1,000గా పరిగణించారు. అయితే రూ.1000 కి పైగా అంటే గరిష్టంగా ఒక ఏడాదిలో రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. 


సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్..
సాధారణంగా ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తాయి. మిగిలిన వారితో పోలిస్తే.. వృద్ధులకు 0.5% అదనంగా అదనపు వడ్డీ ఉంటుంది.  
1) ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా పెట్టుబడి పెట్టే వారు వడ్డీ మొత్తాన్ని క్రెడిట్ చేయడానికి అనేక ఎంపికలను ఎంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికం (మూడు నెలలకు ఒకసారి), అర్ధ వార్షిక (ఆరు నెలలకు ఒకసారి) లేదా వార్షిక (ఏడాదికి ఒకసారి) వారీగా వడ్డీని పొందేందుకు అవకాశం ఉంది. 
2) ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న నిర్దిష్ట ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 


Also Read: Petrol And Diesel Prices: శుభవార్త.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


ఈ రెండింటిలో ఏది బెస్ట్?
సీనియర్ సిటీజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లో పెట్టుబడితో 8.2% వడ్డీ రేటుతో రాబడి ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనితో పోలిస్తే టర్మ్ డిపాజిడ్ కు తక్కువ వడ్డీ రేటును ఇస్తారు. పైగా ఐదేళ్ల కంటే తక్కువ సంవత్సరాలు వ్యవధిలో విత్ డ్రా చేసుకునే ఖాతాలకు పన్ను మినహాయింపు ఉండదు. SCSSలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి ఉంది. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెద్ద మొత్తాలు, సౌకర్యవంతమైన అనేక ఎంపికలు అందుబాటులో ఉంటాయి. వీటిలో దేన్ని ఎంచుకోవాలనే దానికి పెట్టుబడి పెట్టే వారి అవసరాలను బట్టి నిర్ణయించుకుంటే మంచిది. అయితే ఈ రెండు స్కీమ్స్ లోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


Also Read: Huawei Mate X5 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ ఫోల్డబుల్ మొబైల్‌ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్‌ అవుతారు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook