Post office Schemes: బ్యాంకుల కంటే అధిక లాభాల్ని అందించే పోస్టాఫీసు పథకాలు
Post office Schemes: పోస్టాఫీసులో పెట్టుబడి అనేది ఎప్పటికీ సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ అందిస్తుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్‌తో చాలా లాభాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Post office Schemes: పోస్టాఫీసులో పెట్టుబడి అనేది ఎప్పటికీ సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ అందిస్తుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్‌తో చాలా లాభాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
సెక్యూరిటీతో పాటు మంచి లాభాలుండే ఇన్వెస్ట్ కోసం చూస్తుంటే..పోస్టాఫీసు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మంచి లాభాలిచ్చే స్కీమ్. ప్రభుత్వ గ్యారంటీతో పాటు రిటర్న్స్ బాగుంటాయి. అంటే బ్యాంకులతో పోలిస్తే మంచి వడ్డీ రేటు ఉంటుంది.
పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం చాలా సులభం. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలున్నాయి. పోస్టాఫీసులో 1,2,3,5 ఏళ్లకు ఎఫ్‌డి చేయించవచ్చు. పోస్టాఫఫీసు ఎఫ్‌డితో కలిగే లాభాలేంటో చూద్దాం..
పోస్టాఫీసులో ఎఫ్‌డికు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్ల డబ్బు పూర్తిగా సురక్షితం. ఇందులో ఎఫ్‌డి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. ఇందులో 1 కంటే ఎక్కువ ఎఫ్‌డిలు చేయవచ్చు. ఎఫ్‌డి ఎక్కౌంట్‌ను జాయింట్ ఎక్కౌంట్ కూడా చేయవచ్చు. ఇందులో 5 ఏళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ కూడా సాధ్యమే.
పోస్టాఫీసులో చెక్ లేదా నగదుతో ఎఫ్‌డి చేయవచ్చు. ఇందులో కనీసం 1000 రూపాయల్నించి ఎంతైనా జమ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో 7 రోజుల్నించి ఏడాది వ్యవధికైతే 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల వరకూ ఇదే వడ్డీ లభిస్తుంది. 3-5 ఏళ్ల వరకైతే 6.70 శాతం వడ్డీ అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok