Post Office Schemes: ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆలోచన ఉంటే మార్గాలు చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ తప్పించి మిగిలినవాటిలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే జీరో రిస్క్ అనే అర్ధం. అందుకే చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదాయం ఆర్జించాలంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్‌మెంట్ ఉండాల్సిందే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు ఇన్వెస్ట్ చేయాలి. దీనికోసం పోస్టాఫీసులో చాలా పధకాలు ఉన్నాయి. కనీసం 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. తక్కువ మొత్తంలో ప్రారంభించి క్రమంగా పెంచుకోవచ్చు. అందులో ముఖ్యమైంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదొక దీర్ఘకాలిక పధకం. ఇందులో 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది 15 ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. నెలకు 500 రూపాయలు ఇన్వెస్చ్ చేస్తే ఏడాదికి 6 వేల రూపాయలు అవుతుంది. దీనిపై వార్షికంగా వడ్డీ 7.1 శాతం ఉంటుంది. అంటే 15 ఏళ్లలో 1,62,728 రూపాయలు అవుతుంది. మరో 5.5 ఏళ్లకు పొడిగిస్తే 2,66,332 రూపాయలు అవుతుంది. 25 ఏళ్లకు 4,12,321 రూపాయలు అవుతుంది. 


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇది భవిష్యత్తు అవసరాలకు పనిచేస్తుంది. ఇందులో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ ఉంది. నెలకు 500 రూపాయల చొప్పున ఐదేళ్లకు 30 వేలు జమ అవుతాయి. దీనిపై 6.7 శాతం వడ్డీ కలిపితే మొత్తం 35,681 రూపాయలు అవుతాయి. 


సుకన్య సమృద్ధి యోజన మరో పధకం. మీ అమ్మాయి పేరు మీద ప్రారంభించవచ్చు. ఇందులో కనీసం 250 రూపాయలు, గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 500 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేస్తుంటే 15 ఏళ్లకు 90 వేలు అవుతుంది. 21 ఏళ్లకు వడ్డీతో చేతికి అందేది 2,77,103 రూపాయలు. మొత్తానికి పోస్టాఫీసు పధకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ అధికంగా ఉంటాయి. అందుకే చాలామంది పోస్టాఫీసు పధకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. 


Also read: Jio OTT Offers: జియో ప్రీ పెయిడ్ ప్లాన్‌తో 13 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook