Best Mileage Bike Under 80k: 80 వేల లోపే 100 కీలో మీటర్ల మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే.. పూర్తి వివరాలు..
Best Mileage Bike Under 80000 In 2024: మార్కెట్‌లో అతి తక్కువ ధరకే ఎక్కువగా మైలేజ్ ఇచ్చే బైక్స్‌కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పెరుగుతున్న ప్రెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మైలేజ్ ఉన్న బైక్‌లనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
Best Mileage Bike Under 80000 In 2024: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు దృష్టిలో పెట్టుకుని చాలా మంది అధికంగా మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే బడ్జెట్‌లో ధరల్లో లంభించే బైక్‌లను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు ఆటో కంపెనీలు కూడా ధర రూ.80,000లోపే ఉండే మోటర్ సైకిల్స్‌ను తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు గతంలో లాంచ్ చేసిన బైక్‌లను కూడా మాడిఫై చేసి విక్రయిస్తున్నాయి. అయితే సాధరణ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్‌ని ఇచ్చే బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..
బజాజ్ ప్లాటినా 110(Bajaj Platina 110 bike):
ఈ బజాజ్ ప్లాటినా 110 బైక్ గరిష్టంగా లీటర్ ప్రెట్రోల్‌కి 100 కీలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది 115.5cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 8.7 PS వరకు శక్తితో పాటు 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ మరెన్నో ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus bike):
ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ మార్కెట్‌లో మంచి ప్రజాదరణ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండడంతో చాలా మంది యువత దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది గరిష్టంగా లీటర్ ప్రెట్రోల్‌కి 80కిపై మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ 125cc ఇంజన్‌తో వస్తుంది. దీంతో పాటు ఈ ఇంజన్ 9.1 PS శక్తి, 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
TVS స్టార్ సిటీ ప్లస్(TVS Star City Plus):
ఈ బైకి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ TVS స్టార్ సిటీ ప్లస్ బైక్ స్టైలిష్ డిజైన్, ఎక్కువ మైలేజ్‌ని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది గరిష్టంగా లీటర్ ప్రెట్రోల్‌కి 75 కీలో మీటర్ల వరకు మైలేజ్‌ని ఇస్తుంది. ఇది 110cc ఇంజన్‌తో వస్తుంది. అలాగే ఇది 8.4 PS శక్తితో పాటు 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
హొండా CD 110 డ్రీమ్ DX(Honda CD 110 Dream DX):
ఈ హొండా CD 110 డ్రీమ్ DX బైక్ ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది గరిష్టంగా లీటర్‌కి 74 మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ 110cc ఇంజన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ ఇంజన్ 8.6 PS శక్తి, 9.0 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా చాలా రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter