Best Mileage Bikes Under 1.5 Lakh :  మీరు లక్షన్నర బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బైకులు, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ ఉండి, ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 10 వెహికల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350: 


రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైకులో 349.34 సీసీ బిఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 202.2 బీహెచ్ పీ పవర్ 27ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్, బ్యాక్ సైడ్లో డిస్క్ బ్రేకులు ఉంటాయి. అంతేకాదు దీంట్లో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఈ బైకులో 13 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాగ్ కూడా ఉంటుంది. 350 సీసీ బైకుల్లో 36 కిలోమీటర్ లీటర్ కు మైలేజ్ ఇచ్చే టూవీలర్ ఇది. అందులో ఇది బెస్ట్ మైలేజ్ బైకుల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మూడు వేరియంట్లలో , ఎనిమిది రంగుల్లో ఉంటుంది. దీని ధర సుమారు రూ. 1,49, 000నుంచి రూ. 1,74, 430 ఉంటుంది. 


బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200: 


ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మోటార్ సైకిల్ 199.5 సీసీ కెపాసిటి కలిగి ఉంటుంది. ఇందులో బి56 ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది  24.13బీహెచ్ పీ పవర్, 18.74 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. అంతేకాదు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా  ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బండి లీటర్ పెట్రోల్ కు 36కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బజాజ్ బైక్ మూడు వేరియంట్లలో 20 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ధర రూ. 1,42,060 నుంచి 1,58,438 వరకు ఉంటుంది. 


హోండా హార్నెట్  2.0: 


హోండా హార్నెట్ 2.0 బైకులో 184.4 సీసీ కెపాసిటీతో బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 17.03 బీహెచ్పీ పవర్, 15.9 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. యాంటీ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటి ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. లీటర్ కు 42.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ  హోండా హార్నెట్ 2.0 బైక్ సింగిల్ వేరియంట్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధర రూ. 1,40, 327 వరకు ఉంటుంది. 


Also Read: Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!    


టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ : 


ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైకులో 197.75 సీసీ కెపాసిటీతో బిఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇది 20.54 బీహెచ్పీ పవర్ 17.25 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైకులో 12 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఈ బండి లీటర్ కు 41.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ టీవీఎస్ బైక్ సింగిల్ వేరియంట్లో రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ధర రూ.1,49,920 వరకు ఉంది. 


హీరో ఎక్స్​ప్లస్​ 200 4వీ: 


ఈ హీరో ఎక్స్​ప్లస్​ 200 4వీ బైకులో 199.6 సీసీ కెపాసిటీతో బీఎస్6 ఇంజిన్ ఉంది. ఇది 18.9 బీహెచ్పీ పవర్, 17,35ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్తో జోడించి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీంట్లో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటి 13 లీటర్లు ఉంటుంది. ఈ బండి 32.9 మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో 13రంగుల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 1,47,38 లక్షల నుంచి 1,54,763 వరకు ఉంటుంది. 


Also Read: PM Internship Scheme: టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ. 5000 కోటీమంది పొందే అవకాశం, ఈ లింక్‌తో వెంటనే అప్లై చేసుకోండి..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook