Best Mileage SUV Cars Under Rs @10 Lakhs: ప్రస్తుతం చాలా మంది SUV లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ బడ్జెట్‌ ఎక్కువ మైలేజీకి సంబంధించిన కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉండే  SUVలు 28 కి.మీ వరకు మైలేజీని ఇవ్వగలవు. ఒక్కప్పటి SUVలు చాలా వరకు ఎక్కువ మైలేజీని ఇచ్చిన ఇప్పుడు ఇంజన్‌లో మార్పులు చేయడం వల్ల చాలా తక్కువ వరకే మైలేజీని ఇవ్వగలుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా కంపెనీలకు సంబంధించిన SUVలు అందుబాటులో ఉన్నాయి. ఏయే కంపెనీకి చెందిన కారు ఎంత మొత్తం మైలేజీని ఇస్తుందో, భారత్‌లో అత్యంత మైలేజీ SUV కారేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో అత్యుత్తమ మైలేజ్ SUV కార్లు ఇవే:


  • మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా 27.97 వరకు మైలేజీని ఇవ్వగలదు.

  • టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా 27.97 వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

  • మైలేజ్ పరంగా Kia Sonet కొత్త మోడల్‌ కారు కూడా అందుబాటులో రానుంది. Kia Sonet 24.2KMPL వరకు మైలేజీని ఇవ్వగలదు.

  • హ్యుందాయ్ వెన్యూ SUV 23.4 వరకు మైలేజీని ఇస్తుంది.

  • మైలేజ్, బడ్జెట్‌ పరంగా టాటా నెక్సాన్ ఉంది. ఇది 21.5KMPL వరకు మైలేజీని ఇవ్వగలదు. ఇటివలే విక్రయించిన కార్లలో టాటా నెక్సాన్ ఒకటి.

  • మారుతి బ్రెజ్జా కూడా మంచి మైలేజీని అందిస్తుంది. ఇది ప్రస్తుతం ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మారుతి బ్రెజ్జా మైలేజ్ 20.15KMPL వరకు మైలేజీని ఇవ్వగలదు.


అత్యంత ఇంధన సామర్థ్యం గల మారుతి గ్రాండ్ విటారా , టయోటా హైర్డర్ రెండూ 1.5L NA పెట్రోల్, 1.5L అట్కిన్సన్ సైకిల్ పవర్‌ట్రెయిన్ కలిగి ఉంటాయి. ఫీచర్ల నుంచి స్పెసిఫికేషన్ల వరకు రెండు ఒకటే. ఈ రెండింటినీ మారుతీ సుజుకీ, టయోటా భాగస్వామ్యంతో సంయుక్తంగా తయారు చేశారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ (అనగా, 1.5L అట్కిన్సన్ సైకిల్ పవర్‌ట్రెయిన్) 27.97KMPL మైలేజీని అందిస్తుంది. రెండూ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook