Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అలాంటి పథకమే కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే 115 నెలల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయి. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం ముఖ్యంగా రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ కోసం సేవింగ్ లేదా ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ లేకుండా అధిక లాభాలు అందించే పథకాల్లో ప్రతి నెలా కొద్దిమొత్తం సేవ్ చేస్తుంటారు. కిసాన్ వికాస్ పత్రా అలాంటి పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిస్క్ లేకుండా రిటర్న్స్ ఎక్కువగా పొందాలంటే ఇది చాలా మంచి పధకం. ఈ పథకంలో కనీస మొత్తం 1000 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో సింగిల్ లేదా జాయింట్ ఎక్కౌంట్ ఆప్షన్ ఉంది. పదేళ్లు నిండిన మీ పిల్లల పేరుతో కూడా ఎక్కౌంట్ ప్రారంభించవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని ఎక్కౌంట్లయినా ఓపెన్ చేసుకోవచ్చు. 


కిసాన్ వికాస్ పత్రలో ప్రభుత్వం త్రైమాసిక పద్ధతిలో 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. వడ్డీ చెల్లించేది ఏడాదికోసారి. ఇందులో మీరు ఒకవేల 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 115 నెలలకు మెచ్యూర్ అవుతుంది. అంటే 7.5 శాతం వడ్డీ చొప్పున 115 నెలలకు మీరు ఇన్వెస్ట్ చేసిన 5 లక్షల రూపాయలు కాస్తా 10 లక్షలు అవుతాయి. గతంలో ఈ పధకంలో మెచ్యూరిటీ 123 నుంచి 120 నెలలు అయింది. ఇప్పుడిది మరింత తగ్గి 115 నెలలుగా మారింది. 


Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.