Retirement Schemes: చాలామందికి రిటైర్మెంట్ తరువాత అసలు జీవితం ఏంటో అర్ధమౌతుంది. ఒకరిపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. రిటైర్మెంట్ తరువాత కూడా ప్రతినెలా ఆదాయం అనేది ఉంటే మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే నెల నెలా కొంత మొత్తం సేవింగ్ పధకాల్లో పెట్టుబడి పెట్టక తప్పదు. ఆ సేవింగ్ పథకాలేమున్నాయో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిటైర్మెంట్ తరువాత కూడా ఆదాయం పొందాలంటే చాలా పధకాలున్నాయి. ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ భవిష్యత్ ను సంరక్షించుకోవచ్చు. మరొకరిపై ఆధారపడకుండా జీవించవచ్చు. రిటైర్ అయిన తరువాత ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనాలు పొందాలంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల తరువాత ఎన్‌పీఎస్ ఫండ్‌లో 60 శాతం వెంటనే డ్రా చేసుకుని మిగిలిన 40 శాతం మొత్తాన్ని పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. గతంలో ఈ పధకం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తోంది. 


మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి


మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ పధకాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో దీర్ఘకాలికంగా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చు. అది కూడా నెల నెలా లేదా వారానికోసారి కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశముంటుంది. ఇందులో కచ్చితంగా 12 శాతం తగ్గకుండా రిటర్న్స్ ఉండే అవకాశముంది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేముందు రిస్క్ కూడా ఉంటుందనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. 


అటల్ పెన్షన్ పధకం


పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ పథకం మొదలుపెట్టింది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగినవారు ఎవరైనా సరే ఈ పధకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధకం మెచ్యూర్ అయ్యేటప్పటికీ ఇన్వెస్టర్ వయస్సు 60 ఏళ్లకు చేరుతుంది. అప్పుడు పెన్షన్ 1000 నుంచి 5000 అందుకుంటాడు. 


బ్యాంక్ డిపాజిట్


బ్యాంకులో డబ్బులు పొదుపు చేయడం మరో మంచి ఆప్షన్. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిపై వడ్డీ కూడా అధికంగా ఉంటుంది. వివిధ బ్యాంకులు స్పెషల్ వడ్డీ పధకాలు అందుబాటులో తీసుకొచ్చాయి. ఏ బ్యాంకులో అత్యధిక వడ్డీ ఉందో బేరీజు వేసుకుని ఎంచుకోవచ్చు. 


పీపీఎఫ్ పధకం


పీపీఎఫ్ పథకంలో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తున్న పధకమిది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా సురక్షితం. మీ రిటైర్మెంట్ కోసం కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్ అనేది 15 ఏళ్లకు ఉంటుంది. ఇందులో కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ట్యాక్స్ మినహాయింపులు కూడా పొందవచ్చు.


Also read: Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook