Senior Citizens Saving Scheme: ప్రస్తుతం ఎక్కువ మంది పోస్టాఫీసు సేవింగ్స్‌ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అన్ని రకాల పథకాలు అందుబాటులో ఉండడం.. బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీను ఆఫర్ చేస్తుండడంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు సురక్షితంగా ఉండడంతోపాటు అధిక రిటర్న్స్ వస్తుండడంతో పోస్టాఫీసు పథకాలకు డిమాండ్ ఏర్పడింది.  మీరు కూడా రిటైర్మెంట్ తరువాత మీ జీవితం సాఫీగా సాగాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. పోస్టాఫీసులో మంచి స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వడ్డీ ద్వారానే రూ.2 లక్షల ఆదాయాన్ని పొందొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ సిటిజన్లకు పదవీ విరమరణ అనంతరం ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీతో ప్రయోజనం కలగనుంది. 60 ఏళ్లు పైబడిన వారు ఈ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో పాటు వీఆర్‌ఎస్ తీసుకున్న వారు కూడా ఈ పథానికి అర్హులు. ఉదాహరణకు మీరు ఒకేసారి రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రతి త్రైమాసికంలో మీకు రూ.10,250 వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా వార్షిక ప్రాతిపదికన రూ.2,05,000 వడ్డీ ప్రయోజనం చేకూరనుంది.  మూడు నెలలకు వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. 


==> ఒకేసారి డిపాజిట్ చేయాల్సిన మొత్తం-రూ.5 లక్షలు
==> డిపాజిట్ వ్యవధి-5 ఏళ్లు
==> వడ్డీ రేటు-8.2 శాతం
==> మెచ్యూరిటీ మొత్తం-రూ.7,05,000
==> వడ్డీ ప్రయోజనం-రూ 2,05,000
==> త్రైమాసిక ఆదాయం-రూ.10,250


సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే.. పోస్టాఫీసు, ప్రభుత్వ బ్యాంకు లేదా ప్రైవేట్ బ్యాంకులో కూడా తెరవవచ్చు. ఇందులో అకౌంట్‌ను తెరవడానికి ఒక ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. దీంతో పాటు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువెళ్లాలి. ఫారమ్‌తో పాటు గుర్తింపు ధృవీకరణ పత్రం, ఇతర కేవైసీ పత్రాల కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ సొమ్ము నేరుగా బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది.


ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మూలధనంతో కలిపి మొత్తం డబ్బులు ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్‌ కూడా ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు  పొందవచ్చు.


Also Read: IND Vs WI 1st Test Match: రోహిత్‌శర్మకు జోడిగా యంగ్ ప్లేయర్.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్.. టీమిండియా తుది జట్టు ఇలా..! 


Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి