Buy Second Hand Maruti Swift Cars Only @ Rs 5 Lakhs: గత కొన్నేళ్లుగా భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారీగా పెరిగింది. చాలామంది కొత్త కారు కంటే.. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మంచి కండిషన్ ఉన్న కార్లు చాలానే దొరుకుతున్నాయి. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. అమ్మకానికి అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్ కార్ల సమాచారాన్ని మీకు అందిస్తాము. మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో మంచి కండిషన్, సూపర్ లుక్ ఉన్న మారుతి స్విఫ్ట్ కార్లు ఉన్నాయి. వాటి ధర దాదాపు 5 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ కార్లకు రోడ్డు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Swift VDI 2020:
2020 రిజిస్ట్రేషన్‌ గల మారుతి స్విఫ్ట్ వీడిఐ ధర మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో రూ. 4.99 లక్షలుగా ఉంది. ఈ కారు ఫరీదాబాద్‌లో అమ్మకానికి ఉంది. పెట్రోల్ ఇంజన్ ఉన్న కారు మొత్తం 12417 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉంది.


Maruti Swift LXI 2020:
2020 రిజిస్ట్రేషన్‌తో మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ ధర రూ. 5.25 లక్షలుగా ఉంది. గుణలో ఈ కారు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారులో పెట్రోల్ ఉండగా.. రీడింగ్ 137712 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు దాని మొదటి యజమాని వద్ద అమ్మకానికి ఉంది.


Maruti Swift LXI  2020:
మరో మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ కూడా మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. 2020 రిజిస్ట్రేషన్‌ని కలిగి ఉన్న ఈ కారు ధర రూ.5.30 లక్షలు. ఈ కారు మీరట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ కారు మొత్తం 38450 కిమీ ప్రయాణించింది.


Maruti Swift VDI 2019:
2019 రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ వీడిఐ ధర రూ. 5.80 లక్షలుగా ఉంది. జోధ్‌పూర్‌లో ఈ కారు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు రీడింగ్ 38490 కిమీ. ఉండగా.. రెండవ యజమాని అమ్మకానికి పెట్టాడు.


Also Read: Best Mileage SUV 2023: ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఈ సూపర్ 5 ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి!


Also Read: King Cobra Man Viral Video: బుసలు కొడుతున్న డేంజరస్ కింగ్ కోబ్రా.. ఒట్టిచేతులతోనే సింపుల్‌గా పట్టేశాడు! గూస్ బంప్స్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి