Toyota Fortuner Price: కొత్త సంవత్సరంలో గొప్ప అవకాశం.. మారుతీ బ్రెజాకి పెట్టే ధరలో టయోటా ఫార్చ్యూనర్!
Best Second Hand Toyota Fortuner Cars available in CarWale. టయోటా ఫార్చ్యూనర్ కోనాలనుండి.. మీ వద్ద తక్కువ బడ్జెట్ ఉంటే అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు.
Best Second Hand Toyota Fortuner Cars available in CarWale: 'టొయోటా ఫార్చ్యూనర్' కొత్త కారు ధర దాదాపు రూ. 32.5 లక్షల నుంచి మొదలై రూ. 50 లక్షలకు పైగా ఉంటుంది. ఇవి కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు. టొయోటా ఫార్చ్యూనర్ ఆన్-రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. టాప్ మోడల్‌కి అయితే దాదాపు రూ. 60 లక్షల వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన కారు కొనడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అంత సులభం కాదు. అయితే టయోటా ఫార్చ్యూనర్ కోనాలనుండి.. మీ వద్ద తక్కువ బడ్జెట్ ఉంటే అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో ఫార్చ్యూనర్ కారును మీరు ఇంటికేకి తీసుకెళ్లొచ్చు.
మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్ కార్లు చాలా ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజా (టాప్ వేరియంట్ రూ. 13.96 లక్షలు) పెట్టే ధరలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. 'కార్ వాలే' వెబ్‌సైట్‌లో తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 10-14 లక్షలలో మంచి కండిషన్ ఉన్న ఫార్చ్యూనర్ కారును మీరు కొనుగోలుచేయొచ్చు. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
2010 Toyota Fortuner:
2010 మోడల్ టయోటా ఫార్చ్యూనర్ కారు కార్ వాలే వెబ్‌సైట్‌లో కేవలం రూ. 9.51 లక్షల ధరకే అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారు రీడింగ్ 2,86,505 కిలోమీటర్లు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, వైట్ కలర్లో ఉన్న ఈ కార్ ముంబైలో అమ్మకానికి ఉంది.
2012 Toyota Fortuner:
2012 టయోటా ఫార్చ్యూనర్ కారు రూ. 13.25 లక్షలు అమ్మకానికి ఉంది. ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉండగా.. రీడింగ్ 1,55,000 కిలోమీటర్లు. ఈ కారు పూణేలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2013 Toyota Fortuner:
2013 టయోటా ఫార్చ్యూనర్ కారు రూ.14.8 లక్షలకు కార్ వాలే వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారు 2,35,710 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు హైదరాబాద్‌లో విక్రయానికి ఉంది.
2012 Toyota Fortuner:
2012 టొయోటా ఫార్చ్యూనర్ ధర రూ.13.5 లక్షలు. ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉండగా.. రీడింగ్ 1,80,000 కిలోమీటర్లు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, నలుపు రంగు కారు అయిన ఇది నవీ ముంబైలో విక్రయానికి ఉంది.
Also Read: High Cholesterol Risk: ఈ చెడు కొలెస్ట్రాల్ శత్రువు కంటే ప్రమాదం.. కొన్నిసార్లు మరణం కూడా తప్పదు!
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. 4 శాతం డీఏ పెంపు! జనవరి నుంచే పెరిగిన జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.