Best Selling Cars: వినాయక చవితి, దసరా, దీపావళి. పండుగల సీజన్ ఇది. కొత్త వస్తువులు కొనాలనే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కారణంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కార్ల అమ్మకాల్లో వృద్ధి కన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో పండుగ సీజన్(Festival Season)అనేది వివిధ వ్యాపారాలకు కలిసొస్తుంటుంది. పండుగ సీజన్‌లో కంపెనీలు అందించే ఆఫర్‌లు కావచ్చు లేదా పండుగ వేళ కొత్త వస్తువు ఇంట్లో ఉండాలనే సెంటిమెంట్ కావచ్చు. ప్రస్తుతం వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. అందుకే ఆగస్టు నెలలో వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కార్ల అమ్మకాల్లో(Top Car Sales)వృద్ది కన్పించింది. మారుతీ సుజుకీ, హ్యుండయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హోండా కంపెనీలు కార్ల అమ్మకాల్లో(Best Car Sales)స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. ఏ కంపెనీ ఏ మేరకు అమ్మకాలు జరిపిందో తెలుసుకుందాం.


మారుతీ సుజుకీ(Maruti Suzuki) మొత్తం అమ్మకాలు 5 శాతం పెరిగి 1 లక్షా 30 వేల 699 యూనిట్లకు చేరుకోగా..గత ఏడాది ఇదే నెలలో 1 లక్షా 24 వేల 624 వాహనాల్ని విక్రయించింది. దేశీయంగా ఆ సంస్థ అమ్మకాలు మాత్రం 6 శాతం తగ్గి 1 లక్షా 10 వేల 80 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించిందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇక ఇదే నెలలో హ్యుండాయ్ కంపెనీ 12 శాతం వృద్ధి సాధించింది. మొత్తం 59 వేల 68 వాహనాల్ని విక్రయించింది. మరో ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) గత ఏడాది ఆగస్టులో 35 వేల 420 వాహనాల్ని విక్రయించగా..ఈ ఏడాది ఆగస్టు నెలలో మాత్రం ఏకంగా 53 శాతం వృద్ధి సాధించి 54 వేల 190 వాహనాల్ని విక్రయించగలిగింది. 


ఇక మహీంద్ర అండ్ మహీంద్రా(Mahindra and Mahindra) అమ్మకాలు 17 శాతం పెరిగాయి.15 వేల 973 యూనిట్లను అమ్మగలిగింది. థార్,ఎక్స్‌యూవీ 300, బొలేరో నియో, బొలేరో పిక్ ఆప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ తెలిపింది. కియా మోటార్స్(Kia Motors)ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధి సాధించాయి. ఆగస్టు నెలలో 16 వేల 750 యూనిట్లను విక్రయించింది. ఇదే కంపెనీ గత ఏడాది కేవలం 10 వేల 845 యూనిట్లే అమ్మగలిగింది. పండుగ సీజన్ సమీపిస్తుండంతో ఆటో కంపెనీలు స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో అంటే పండగ సమయంలో మరింతగా బుకింగ్స్ పెరగవచ్చని అంచనా ఉంది. 


Also read: Jio New Reachrge Plans: జియో కొత్త ప్లాన్స్‌..ఫ్రీ డేటా, కాలింగ్ తో పాటు ఉచితంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook