Best Cars in India: మనదేశంలో కార్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంటే ఈ ఏడాది ఏకంగా 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. వీటిలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUVలు) అమ్మకాలలో భారీగా పెరుగుదల ఉంది. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్‌తో సహా అనేక కార్ల కంపెనీలు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో కార్ల కంపెనీలు మొత్తం 42.3 లక్షల వాహనాలను డీలర్లకు పంపించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల కార్లతో పోలిస్తే.. 9 శాతం ఎక్కువ పంపించాయి. ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌సేల్ విక్రయాల్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల వాటా 2022-23లో 43 శాతంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 50.4 శాతానికి పెరగడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Flaxseed and Aloevera Hairmask: ఈ 2 వస్తువులతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి.. మీ జుట్టు కుదళ్ల నుంచి బలపడుతుంది..


గత ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ వార్షిక దేశీయ విక్రయాలు 17,93,644 యూనిట్లను నమోదు చేసిందని అత్యధికంగా అమ్మకాలు జరిపినట్లు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 2,83,067 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం వార్షిక విక్రయాల సంఖ్య 20 లక్షల యూనిట్లను దాటినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.


కార్ల అమ్మకాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 7,77,876 యూనిట్లను నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7,20,565 యూనిట్ల కంటే 8 శాతం ఎక్కువ కావడం విశేషం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,53,019 యూనిట్లతో పోలిస్తే ఎగుమతులు 7 శాతం పెరిగి 1,63,155 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ వెల్లడించింది.  


2023-24 ఆర్థిక సంవత్సరంలో  ప్యాసింజర్ వాహన విక్రయాలు 5,73,495 యూనిట్లుగా నమోదు చేసినట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5,41,087 యూనిట్ల కంటే 6 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 5,73,495 యూనిట్ల పీవీలను (ఈవీలతో సహా) హోల్‌సేల్ అమ్మకాలు జరిపినట్లు పేర్కొన్నారు. వరుసగా మూడవ సంవత్సరం అత్యధిక అమ్మకాలు జరిగాయన్నారు.


మహీంద్రా అండ్ టయోటా కూడా విక్రయాలలో భారీ పెరుగుదల ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 28 శాతం వృద్ధి సాధించాయి. 4,59,877 యూనిట్లను విక్రయించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో  3,59,253 కార్ల అమ్మకాలను జరిగాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,63,512 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలను జరిపింది. ఇప్పటివరకు అత్యధిక టోకు విక్రయం ఇదే కావడం విశేషం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,77,683 యూనిట్లను అమ్మకాలు జరిపింది. గతేడాదితో పోలిస్తే 48 శాతం విక్రయాలు పెరిగాయి. 


Also Read:  Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి